GHMC: గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ లు లేకుండా, నగర పౌరుల ప్రయాణం సజావుగా జరిగి, ప్రమాదాలకు చెక్ పెట్టే దిశగా జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ డ్రైవ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలలో భాగంగా గుంతల పూడ్చివేత పనులు, క్యాచ్ పిట్ రిపేర్ల లు, రోడ్ల మరమ్మత్తు పనులు, ప్యాచ్ వర్క్ పనులు, కవర్ రీప్లేస్ మెంట్, సెంట్రల్ మీడియన్ మరమ్మతులు నిరంతరంగా కొనసాగుతున్నాయి.
Also Read: GHMC: హైదరాబాద్ వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం.. జీహెచ్ఎంసీ డ్రెయిన్ల మ్యాపింగ్ ప్రక్రియ షురూ
ఈ పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ మెయింటనెన్స్ వింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకూ నగరంలో మొత్తం 21 వేల 631 గుంతలు గుర్తించగా, వాటిలో ఇప్పటి వరకు 20 వేల 337 గుంతలకు మరమ్మతులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 943 క్యాచ్ పిట్స్ రిపేర్లు, 474 కవర్ రీ ప్లేస్ మెంట్లు, 14 సెంట్రల్ మీడియన్ మరమ్మతులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
పర్యవేక్షణలో రోడ్ సేప్టీ డ్రైవ్ ముమ్మరం
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశాల మేరకు చీఫ్ ఇంజినీర్ (మెయింటనెన్స్) రత్నాకర్ సహదేవ్ పర్యవేక్షణలో రోడ్ సేప్టీ డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నట్లు వెల్లడించారు. ఇక ఎల్ల్బీనగర్ జోన్ లో 3 వేల 695, చార్మినార్ జోన్ లో 2 వేల 878, ఖైరతాబాద్ జోన్ లో 3 వేల 637, శేరిలింగంపల్లి జోన్ లో 2 వేల 335, కూకట్ పల్లి జోన్ లో 2 వేల 996, సికింద్రాబాద్ జోన్ లో 4 వేల 846 గుంతలను పూడ్చగా, ఇప్పటి వరకూ మొత్తం 20 వేల 337 గుంతలను పూడ్చినట్లు అధికారులు తెలిపారు.
Also Read: GHMC: ఫుటోవర్ బ్రిడ్జిలపై అధ్యయనం.. స్టడీ చేసి నివేదికలను సమర్పించాలని ఆదేశం
