GHMC: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యం మరింతగా మెరుగుపరచడానికి అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఎప్పటికపుడు తనిఖీలు నిర్వహిస్తూ, మరింత ఫోకస్ పెంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్(Rv Karnana) ఆదేశించారు. సోమవారం గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా జీహెచ్ఎంసీ(GHMC) ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కమిషనర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. గత నెల 29న ప్రారంభించిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ 31న ముగియనుందన్నారు. ఇప్పటి వరకూ జరిగిన జీహెచ్ఎంసీ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని సమీక్షించారు. రానున్న రోజుల్లో మరింత ఎఫెక్టివ్‌గా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, క్షేత్ర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యవంతులను చేయాలని ఆదేశించారు. ప్రజా భాగస్వామ్యంతో పరిశుభ్ర నగరంగా గ్రేటర్ హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్నారు.
Also Read: Kaleshwaram Project Case: కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు.. కేసీఆర్, హరీశ్ రావుకు స్వల్ప ఊరట
5641 మెట్రిక్ టన్నుల వ్యర్థాల తరలింపు
మెరుగైన శానిటేషన్ కోసం జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న ప్రత్యేక మెగా శానిటేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ జీహెచ్ఎంసీ పరిధి 300 వార్డులలోనీ మొత్తం 3613 ఏరియాలు, పాయింట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు, పార్క్‌లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టగా, ఇప్పటి వరకు అదనంగా 4243 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు, 1398 నిర్మాణ వ్యర్థాలు.. మొత్తం 5641 మెట్రిక్ టన్నుల అదనపు వ్యర్థాల తరలింపు చేపట్టారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో డ్రైవ్‌ను పర్యవేక్షిస్తున్నట్లు జూమ్ మీటింగ్‌లో కమిషనర్‌కు వివరించారు.
Also Read: Crorepati Beggar: రోడ్డుపై భిక్షాటన భిక్షగాడికి 3 ఇళ్లు, 3 ఆటోలు, ఒక కారు.. నివ్వెరపోతున్న జనాలు!

