GHMC: వానాకాలం సందర్భంగా నగరవాసులకు వర్షాకాల కష్టాలను వీలైనంత మేరకు తగ్గించేందుకు జీహెచ్ఎంసీ(GHMC) ప్రయత్నాలు చేస్తుంది. మున్సిపల్ శాఖ ఇటీవల జారీ చేసిన ఆదేశాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) నగరంలో వానాకాలం సహాయక చర్యలు, ఇకపై ప్రతి సంవత్సరం నాలాల్లోని పూడికతీత పనుల బాధ్యతలను మున్సిపల్ శాఖ హైడ్రా(Hydraa)కు అప్పగించినా, స్థానిక సంస్థగా తన వంతు బాధ్యతలను నిర్వర్తించేందుకు ముందుకొచ్చిన జీహెచ్ఎంసీ మరింత మెరుగ్గా వర్షాకాల సహాయక చర్యలను అందించేందుకు సిద్దమైంది. ఇప్పటి వరకు వర్షాకాలం తలెత్తిన ఇబ్బందులు, వరద ముంపు, విపత్తులు, ప్రక్రృతి వైపరీత్యాలు, ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలను నూటికి నూరు శాతం అధిగమించేందుకు ఖచ్చితమైన రెయిన్ అలర్ట్ తెప్పించుకునేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది.
వాతావరణ హెచ్చరికలు
ఇందుకు గాను వర్షం ఎపుడు కురవనుంది?ఏ ఏ ప్రాంతాల్లో కురవనుంది? అన్న విషయాన్ని ఇదివరకున్న పాత విధానంలో గాకా, పక్కాగా, నూటికి నూరు శాతం కరెక్టు సమాచారాన్ని తెప్పించుకునేందుకు ముగ్గురు వాతావరణ నిపుణులను నియమించుకున్నట్లు తెలిసింది. అంతేగాక, ఇప్పటికే ముంబై మహానగరానికి వాతావరణ హెచ్చరికలు విషయంలో సహకరిస్తున్న సంగారెడ్డి త్రిబుల్ ఐటీ, ముంబై మహానగరానికి అందించిన సహకారాన్ని హైదరాబాద్(Hyderabad) మహానగరానికి కూడా అందించాలని కోరినట్లు తెలిసింది. ప్రతి వర్షాకాలం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి ఆగమాగమయ్యే ముంబై మహానగరానికి సంగారెడ్డి త్రిబుల్ ఐటీ(Sangareddy IIIT) ఇస్తున్న రెయిన్ అలర్ట్స్ నూటికి నూరు శాతం ఫలిస్తుండటం, ముంబై మహానగర పాలక శాఖ చేపట్టిన ముందస్తు వర్షాకాల సహాయక చర్యలను కూడా జీహెచ్ఎంసీ స్టడీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ముందుగా అలర్ట్స్ తెప్పించుకోగలిగితే
ఖచ్చితమైన వాతావరణ అలర్ట్స్ తెప్పించుకోగలిగితే ముందస్తుగా స్పందించి వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టి, ట్రాఫిక్ జామ్ కాకుండా నివారించటంతో పాటు ప్రాణ నష్టం కూడా జరగకుండా చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణ శాఖ(Meteorological Department) జారీ చేస్తున్న రెయిన్ అలర్ట్స్ ప్రకారం జీహెచ్ఎంసీ‘(GHMC), హైడ్రా(Hydraa) ముందస్తు చర్యలు చేపడుతున్నా, జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా నియమించుకున్న ముగ్గుర నిపుణలు ఇచ్చే రెయిన్ అలర్ట్స్(Rain alerts) తో వాతావరణ శాఖ ఇచ్చే అలర్ట్స్ ను విశ్లేషించి, ఖచ్చితంగా ఏ ప్రాంతంలో వర్షం కురవనుంది? ఎంత మేరకు వర్షం కురిసే అవకాశముందన్న విషయాలను నిర్థారించుకున్న తర్వాత అందుకు తగిన విధంగా సహాయక చర్యలను చేపట్టాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది.
Also Read: Kavitha on Leadership: చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతాం.. కవిత స్పష్టం!
భారీ నుంచి అతి భారీ వర్షాలు
కేవలం ఒకే ప్రాంతంలో తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో అంటే పది సెంటీమీటర్ల కు మించి వర్షం కురిసే అవకాశముంటే, ఆయా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ముందస్తు చర్యలు చేపట్టడం, లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి నీరు ప్రవహించకుండా ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ(GHMC) సిద్దమవుతున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మహానగరంలో అందుబాటులో ఉన్న నిజాం కాలం నాటి వరద నీటి కాలువలు, కబ్జాల కోరల్లో చిక్కి బక్క చిక్కి పోయిన నాలాలు గంటకు కేవలం రెండు సెంటీమీటర్లకు మించి వర్షం పడితే తట్టుకునే పరిస్ధితి లేనందున, ఈ వర్షాకాలం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున, లోతట్టు ప్రాంతాల్లో ముంపు, భారీ వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద చిక్కులు, వాహనదారుల కష్టాలను దూరం చేసేందుకు జీహెచ్ఎంసీ ముందస్తుగా ఖచ్చితమైన రెయిన్ అలర్ట్స్ తెప్పించుకునేందుకు ముగ్గురు నిపుణలను నియమించటంతో పాటు త్రిబుల్ ఐటీ సంగారెడ్డి సహాకారం తీసుకుంటున్నట్లు సమాచారం.
సిటిజనులకు మేసేజ్‌లు
ముగ్గురు వాతావరణ నిపుణలు, త్రిబుల్ ఐటీ సంగారెడ్డి ఇచ్చే ఖచ్చితమైన రెయిన్ అలర్ట్స్ ను జీహెచ్ఎంసీ సిటీ వాసులను అప్రమత్తం చేసేందుకు పౌరులకు కూడా పంపించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. గతంలోనే నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న సుమారు 19.5 లక్షల ఆస్తుల యజమానుల ఫోన్ నెంబర్లను సేకరించింది. ఖచ్చితమైన సమచారం జీహెచ్ఎంసీ(GHMC)కి అందగానే ఎక్కడెక్కడ వర్షం కురిసే అవకాశముందన్న సమాచారాన్ని పౌరులకు, జీహెచ్ఎంసీ మొత్తం సిబ్బందికి, హైడ్రా(Hydraa)తో పాటు ఇతర శాఖలకు చేరవేయటంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశామున్న సమయంలో అత్యవసరమైతే తప్పా, ఇంటి నుంచి బయటకు రావద్దని మేసేజ్ లు కూడా పంపేందుకు వీలుగా బల్దియా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
Also Read: NIMS Fire Incident: అగ్నిప్రమాదంపై ఆధారాలు లేవా? దర్యాప్తుపై అనుమానాలు
