GHMC Commissioner: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వాసులకు అత్యవసర సేవలందించే బల్దియా బాసు కమిషనర్ ఆర్. వి. కర్ణన్(RV Karnan) ఆదేశాలు బేఖాతరవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు నెలల కిందటే ఎల్.బి. నగర్(LB Ngar) లోని ఒక నిర్మాణ స్థలంలో సెల్లార్ కూలి ముగ్గురు కార్మికులు మరణించిన సంఘటనతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించిన జీహెచ్ఎసీ(GHMC) అధికారులు ప్రతి ఏటా వర్షాకాలంలో సెల్లార్ల తవ్వాలను నిషేధించినా, గ్రేటర్ లో ఎక్కడబడితే అక్కడ ప్రమాదకర స్థాయిలో సెల్లార్ల తవ్వాకాలు జరుగుతున్నా, టౌన్ ప్లానింగ్(Toun Planing) అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. కనీసం వర్షాకాలం ప్రాణనష్ట నివారణ చర్యల్లో భాగంగా సెల్లార్లపై విధించిన నిషేధాన్ని పక్కాగా అమలు చేయాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులే అనధికారికంగా సెల్లార్ల తవ్వకాలకు అనుమతులిస్తూ, చూసీచూడనట్టుగా వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
నిషేధం అమలు ఎక్కాడా కూడా కన్పించకపోవటం
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో సెల్లార్లు కులి, కార్మికులు మృతి చెందుతున్న ఘటనలు జరుగుతున్నాయన్న విషయం తెలిసీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు తవ్వకాలను అడ్డుకోకపోవటంలో ఆంతర్యమేమిటీ? అన్న ప్రశ్న తలెత్తుతుంది. వర్షాకాలం ముగిసేవరకు భవన నిర్మాణాలకు సంబంధించిన సెల్లార్ల తవ్వకాలను జీహెచ్ఎంసీ(GHMC) మే 30వ తేదీ నుంచి నిషేధించినా, నిషేధం అమలు ఎక్కాడా కూడా కన్పించకపోవటం టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుకు నిదర్శమనన్న వాదనలున్నాయి. మే 30వ తేదీకి ముందు తీసుకున్న అనుమతులతో మాత్రమే సెల్లార్లు తవ్వుకునే అనుమతులుండగా, ఎలాంటి అనుమతుల్లేకుండా కొత్తగా మొదలైన నిర్మాణాల్లో కూడా ఎల్బీనగర్(LB Nagar), శేరిలింగంపల్లి(Sherelingam Pally) జోన్లలో పదుల సంఖ్యలో అక్రమంగా సెల్లార్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి
. కమిషనర్ ఆదే శాలను టౌన్ ప్లానింగ్(Toun Planing) అధికారులు కూడా బుట్టదాఖలు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విస్తారంగా వర్షాలు కురిస్తే భవనాల కింద నుండి నేల కోతకు గురై ప్రమాదాలు జరిగే అవకాశాలెక్కువగా ఉన్నాయి. వర్షం కురిసిన సమయంలో సెల్లార్లలో భారీగా వర్షపు నీరు చేరి, అందులో దోమలు వృద్ధి చెందు తున్నాయంటూ ఫిర్యాదులు వచ్చినా ఎంటమాలజీ విభాగం అధికారులు సైతం పట్టించుకోవటం లేదని ఫిర్యాదుదారులు వెల్లడించారు.
Also Read: Loans to Women: సంఘాల్లో సభ్యురాలిగా ఉన్న వ్యక్తికి సైతం రుణం!
సర్కిల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారు?
గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు, సెల్లార్ల(Sellar) తవ్వకాలతో పాటు అనుమతి తీసుకుని చేపట్టిన నిర్మాణాల వద్ద ప్రమాద నివారణ ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని ఫీల్డులెవెల్ లో తనిఖీలు చేయాల్సిన బాధ్యత సర్కిళ్ల టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ఉన్నా, వారు ఏ మాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలున్నాయి. సర్కిల్ స్థాయిలో భవననిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ)లు ఫీల్డు లెవెల్ తనిఖీలు నిర్వహించటం లేదని ఎల్బీనగర్ లోని పలు సర్కిళ్ల టౌన్ ప్లానింగ్ సిబ్బందే బాహాటంగా వ్యాఖ్యానించటం టౌన్ ప్లానింగ్ నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. సెల్లార్ల తవ్వకాలను నియంత్రించాల్సిన సర్కిల్ స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
మాదాపూర్లోని సైబర్ టవర్స్(Cyber Tower) వెనుక ఉన్న పత్రికా నగర్లో ఓపెన్ సెల్లారు తవ్వారు. రాంనగర్ ప్రాంతంలో కూడా ఇష్టా రాజ్యంగా సెల్లార్ల తవ్వకాలు చేపట్టారు. రాంనగర్ గుండు ప్రధాన రహదారిలో యథేచ్ఛగా సెల్లార్ తవ్వ కాలు చేపట్టారు. మట్టిని రిటైనింగ్ వాల్ లేకుండానే జెసిబితో ఉపయోగించి సెల్లార్ తవ్వకం జరుగుతోంది. ప్రక్కనే ఉన్న భవనానికి ప్రమాదకరంగా తవ్వకాలు చేపట్టారనే ఆరోపణలున్నాయి. దీనికితోడు రాంనగర్ అల్లం ఛాయ్ హోటల్ వద్ద , రాంనగర్ గుండు ప్రధాన రహదారిలో, రాంనగర్ అల్లం చాయ్ హోటల్ వద్ద జరుపుతున్న సెల్లార్ తవ్వకాలకు ఎలాంటి అనుమతుల్లేవని తెల్సింది. వీటిపై ఫిర్యాదులున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలున్నాయి.
Also Read: Amrapali Kata: ఆమ్రపాలి ఈజ్ బ్యాక్.. మేడం వచ్చేస్తున్నారహో!