Loans to Women(image credit: twitter)
తెలంగాణ

Loans to Women: సంఘాల్లో సభ్యురాలిగా ఉన్న వ్యక్తికి సైతం రుణం!

Loans to Women: ఫైబర్ గ్రిడ్‌కు స్త్రీనిధి రుణాలు ఇవ్వనున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. (Women’s Association) మహిళా సంఘంలోని సభ్యులు దరఖాస్తు చేసుకుంటే ఆ గ్రామానికి సంబంధించిన ‘గ్రిడ్’ బాధ్యతలను అధికారులు అప్పగించనున్నారు. ఒక్కొక్కరికి 300యూనిట్లు(300 కనెక్షన్లు) ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పరికరాల కోసం సుమారు 5లక్షల వరకు రుణం ఇచ్చేందుకు ప్రాణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలోనే జిల్లాలోని డీఆర్డీఏ అధికారులకు సర్క్యూలర్ ఇవ్వనున్నట్లు సమాచారం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఈ ఫైబర్ గ్రిడ్ బాధ్యతలను అప్పగిస్తున్నారు.

ఇంటింటికీ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యం
తెలంగాణలోని ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ పథకాన్ని (Fiber Grid Scheme) ప్రవేశపెట్టింది. 4వేలకోట్ల వ్యయంతో ఈ పథకానికి భారత్ నెట్ పథకం ద్వారా కేంద్రం ఆర్థికసాయం చేస్తున్నది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని 464 మండలాల్లోని 8778 గ్రామ పంచాయతీల్లోని 10,128 గ్రామాల్లోని 83లక్షల 58వేల గృహాల్లోని 3కోట్ల 5లక్షల కంటే ఎక్కువ ప్రజలకు అందుబాటు ధరలతో అధిక వేగం కలిగిన అంతర్జాలంను అందించడం ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి ప్రజలకు (గవర్నమెంట్ టు గవర్నమెంట్ (జి2జి), గవర్నమెంట్ టూ సిటిజన్స్ (జి2సి)ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు, ఇతర ప్రజా సేవ సంస్థలకు అధిక వేగం కలిగిన అంతర్జాలంను అందించడం ఎలాంటి తేడాలు లేకుండా అందరికి ఒకే విధమైన అంతర్జాలంను అందించడం జరుగుతుంది.

గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువ మందికి టెలిమెడిసిన్, విద్యా అవకాశాలను అందించడం ద్వారా ఆరోగ్యం, విద్యను మెరుగుపరచడానికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా గృహాలకు 4-100 ఎంబీపీఎస్, సంస్థలు ఆన్-డిమాండ్ 20-100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్‌ను పంపిణీ చేస్తారు. అయితే, గ్రామం వరకు ఫైబర్ కేబుల్ వేస్తారు. ఆ కేబుల్‌ను ఇంటింటికి కనెక్షన్ ఇచ్చే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు సమాచారం.

 Also Read: Bhu Bharati Act: ధరణి కష్టాలకు.. భూ భారతి చెక్ పెట్టేనా?

కేబుల్ ఆపరేటర్ మాదిరిగా
గ్రామాల్లోని మహిళా సంఘాలు యాక్టివ్‌‌గా పనిచేస్తున్నాయి. ఆ గ్రూపుల్లోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. అయితే,(Government) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫైబర్ గ్రిడ్ బాధ్యతలను సైతం మహిళా సంఘాలకు అప్పగించబోతున్నారు. మహిళా సంఘంలో సభ్యురాలై ఉంటే దరఖాస్తు చేసుకుంటే శ్రీనిధి వారికి రుణాలు మంజూరు చేస్తుంది. 4లక్షల నుంచి 5 లక్షల వరకు రుణం ఇచ్చేందుకు స్త్రీనిధి సన్నద్ధమవుతుంది.

ఈ రుణంతో ఇంటింటికి వైరు, రూటర్, వైఫై బాక్సులకు సంబంధించిన పరికరాలను కొనుగోలు చేసేందుకు దోహదపడుతుంది. అంతేగాకుండా గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న కేబుల్ ఆపరేటర్ మాదిరిగా మహిళా సంఘాల సభ్యులు ఇంటింటికి(ఆసక్తి ఉన్నవారికి) కేబుల్ వేస్తారు. వారి నుంచి నెలనెల చార్జీలు వసూలు చేయడం, రీఛార్జ్ చేసే బాధ్యతను వారికే స్త్రీనిధి అధికారులు అప్పగించనున్నారు. ఒక గ్రామం, లేదా రెండు గ్రామాలు కలిపి 300 కనెక్షన్లు ఉండేలా చూసుకోవాలని ఇప్పటికే మౌలికంగా తెలిపినట్లు సమాచారం. దీంతో ప్రతి నెల వారీ 18 వేలకు పైగా ఆదాయం సమకూరే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్త్రీనిధి నుంచి ఇచ్చే రుణంను 72 నెలల్లో చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ప్రణాళికలు రూపొందించారు.

త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు
గ్రామాల్లో ఫైబర్ కేబుల్‌కు సంబంధించిన ఉత్తర్వులు జిల్లా స్థాయి డీఆర్డీఏ, సెర్ప్ అధికారులకు అధికారికంగా ఇవ్వనున్నట్లు స్త్రీనిధి అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ ఫైబర్ కేబులపై అధికారులు శిక్షణ సైతం ఇచ్చినట్లు తెలిసింది. మహిళలను గ్రామీణ ప్రాంతాల్లో మరింత బలోపేతం చేయాలని, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్ది ఈ పైబర్ కేబుల్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇంటర్ నెట్ తో పాటు టీవీ సైతం తక్కువ ధరలో చూసే సదుపాయం ఉంటుందని ప్రజలకు తెలుపునున్నారు. నెలలవారీగా ఫైబర్ కేబుల్ కనెక్షన్ తీసుకున్నవారు ఎంత చెల్లించాలనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటున్నారని సమాచారం.

వివరాల సేకరణలో అధికారులు
ఎన్ని గ్రామాలకు ఇప్పటివరకు ఫైబర్ గ్రీడ్ కేబుల్ వేశారు? ఆయా గ్రామాల ప్రజలు సముఖత ఉన్నారా? మహిళా సంఘాలు యాక్టీవ్‌గా ఉన్నాయా? అందులోని సభ్యులు దరఖాస్తు చేసుకున్నారా? తదితర వివరాలను సేకరిస్తున్నారు. అంతేగాకుండా ఒక్కో ఇంటికి కనెక్షన్ ఇస్తే పరికరాలకు ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను సైతం ఎస్టీమేషన్ వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్షన్ ఇస్తామని ప్రకటించింది.

అదే విధంగా గ్రామపంచాయతీలకు సైతం కనెక్షన్ పైబర్ గ్రిడ్‌తో ఇస్తుంది. ప్రభుత్వ ఇచ్చే ఈ సదుపాయంతో మారుమూల గ్రామాల్లో ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రుణాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాం
= స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి
ప్రభుత్వం అన్ని గ్రామాలకు ఫైబర్ గ్రిడ్ కేబుల్ వేస్తుంది. ఈ కేబుల్ గ్రామాల్లోని ఇళ్లకు కనెక్షన్ ఇచ్చే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నారు. వారికి గ్రిడ్ పరికరాల కోసం 5లక్షల వరకు రుణం ఇవ్వనున్నాం. ఆసక్తి ఉండి మహిళా సంఘాల్లోని సభ్యురాలై ఉంటే రుణంను స్త్రీనిధి నుంచి ఇవ్వనున్నాం. వారి నుంచి నెలవారీగా రుణం చెల్లించే లా చర్యలు తీసుకుంటున్నాం. 72 నెలలు రుణం చెల్లించేలా టార్గెట్ పెట్టనున్నాం.

 Also Read: Telangana Cabinet Meeting: సుదీర్ఘంగా క్యాబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం!

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?