Telangana Cabinet Meeting( iMAGE CREDIT: SWETCHA REPORTER)
తెలంగాణ

Telangana Cabinet Meeting: సుదీర్ఘంగా క్యాబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం!

Telangana Cabinet Meeting: తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ దాదాపు 6 గంటల పాటు జరిగింది. ఇందులో ప్రధానంగా పది అంశాలపై డిస్కషన్ చేసి, ఆమోద ముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, (Ponguleti Srinivas Reddy) పొన్నం ప్రభాకర్, Ponnam Prabhakar) వాకిటి శ్రీహరిలు  సెక్రటేరియట్‌లో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం రైతు భరోసాను విజయవంతంగా రికార్డు వేగంతో అందించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతునేస్తం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో 9వేల కోట్లు ప్రభుత్వం రైతుల (Farmers) ఖాతాల్లో జమ చేసిందన్నారు.

కోటీ 49 లక్షల ఎకరాలకు ఈ సాయాన్ని పంపిణీ చేసిందన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో రాష్ట్రంలోని దాదాపు 71 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని వివరించారు. ఈ శుభ సందర్భాన్ని రైతుల (Farmers) సమక్షంలోనే ఉత్సవంగా జరుపుకోవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సెక్రెటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో (Farmers) ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అంతేగాక అన్ని జిల్లాల్లో రైతు వేదికలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని క్యాబినెట్ (Cabinet) నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అంతేగాక తెలంగాణలో ప్రతీ జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 9వ తేదీన అన్ని జిల్లాల్లో ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 Also Read: Devineni: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. వైసీపీలో చేరికపై దేవినేని క్లారిటీ

రీజినల్ రింగ్ రోడ్డుకు క్యాబినెట్ ఆమోదం
(Hyderabad)హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్‌మెంట్ ప్రతిపాదనలను క్యాబినెట్ ఆమోదించినట్లు చెప్పారు. ఆర్ అండ్ బీ విభాగం తయారు చేసిన మూడు ప్రతిపాదనలను క్యాబినెట్ పరిశీలించినట్లు వివరించారు. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలో మీటర్ల పొడవు ఉండే అలైన్‌మెంట్‌కు తుది ఆమోదం క్యాబినెట్ (Cabinet) తెలిపినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏపీ తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదన్నారు. గత ప్రభుత్వంలోనే బనకచర్లకు పునాది పడిందని చెప్పారు. ఇప్పుడు హడావుడి చేస్తూ మాజీ మంత్రులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి స్వయంగా ఢిల్లీకి వెళ్లి కలిసి విజ్ఞప్తి చేశారన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని క్యాబినెట్ తీర్మానించిందన్నారు. ప్రజల్లోకి బనకచర్ల ప్రాజెక్టు వాస్తవాలను స్పష్టంగా తీసుకువెళ్లాలని క్యాబినెట్ తీర్మానించిందన్నారు. ఇక రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశంలో చర్చించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదన్నారు.

కమిషన్‌కు పూర్తి వివరాలు అందజేస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై క్యాబినెట్ చర్చించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు‌కు సంబంధించి ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న పూర్తి వివరాలను ఈ నెల 30 లోగా కమిషన్‌కు అందించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన క్యాబినెట్ (Cabinet) మినిట్స్, సబ్ కమిటీ డిస్కషన్ వివరాలన్నీ కమిషన్‌కు సమర్పిస్తామన్నారు. మాజీ మంత్రులు కమిషన్‌కు తప్పుడు వివరాలు ఇస్తున్నారని, కానీ, తాము అధికారిక మినిట్స్‌ను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గతంలో ఏం జరిగిందనేది స్పష్టంగా కమిషన్‌కు ఇస్తామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులకు ఈ బాధ్యతను అప్పగించామన్నారు.

పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఇకపై ప్రతి నెలలో రెండు సార్లు క్యాబినెట్ (Cabinet) మీటింగ్, మూడు నెలలకోసారి స్టేటస్ రిపోర్ట్ మీటింగ్‌గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ మూడు నెలల్లో జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను ఈ ప్రత్యేక భేటీ‌లో సమర్పించి చర్చిస్తారన్నారు. ఈ మూడు నెలల ప్రత్యేక భేటీకి మంత్రివర్గంతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దీంతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించామన్నారు. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కమిషనర్లతో పాటు వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం
మంత్రి  మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేలా, క్రీడా ప్రమాణాలను పెంపొందించేలా రూపొందించిన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని క్యాబినెట్  ఆమోదించిందన్నారు. ఈ పాలసీలో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధి (టీఎస్ డీపీ)ని ఏర్పాటు చేస్తుందన్నారు. జిల్లాలో క్రీడా అభివృద్ధికి ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో ఉండే క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ (సీబీఎఫ్)లో 10 శాతం కేటాయించాలన్న నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించిందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ల అర్హత జాబితాలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి విజేతలకూ అవకాశం కల్పించాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఇక, తాను మంత్రిగా ఉన్న సందర్భంలోనే స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడం గర్వకారణమన్నారు. స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం తెలంగాణలో ఉన్న క్రీడాకారులకు, క్రీడా ప్రేమికులకు ఒక వరం లాంటిదన్నారు. 2036 జరుగనున్న ఒలింపిక్స్‌లో తెలంగాణ సత్తా చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. 8 నుంచి 10 సంవత్సరాల మధ్య క్రీడాకారులకు గ్రామీణ స్థాయి నుంచి గుర్తించి సీఎం కప్ తరహాలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 2036లో జరిగే ఒలంపిక్స్ తెలంగాణ సత్తాను చాటేలా క్రీడాకారులను ప్రిపేరు చేస్తామన్నారు. అనుభవం ఉన్న కోచ్‌లను నియమించి క్రీడాకారులకు శిక్షణ ఇస్తామన్నారు. క్రీడల అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలను మరింత మెరుగపరుస్తామన్నారు. తెలంగాణ గడ్డనుంచి దేశ, అంతర్జాతీయ స్థాయిల్లో నిలిచే క్రీడాకారులను తయారు చేస్తామన్నారు.

తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించేందుకు కేబినెట్ (Cabinet) ఆమోదం తెలిపిందన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, ప్రణాళికల తయారీకి వివిధ రంగాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, నిపుణులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ (Cabinet) నిర్ణయించినట్లు తెలిపారు. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ధి సాధించాలనేది లక్ష్యం పెట్టుకున్నామన్నారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. అన్ని శాఖలు, అన్ని విభాగాలు ఇందులో భాగస్వామ్యం పంచుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు.

ఆశించిన వృద్ధి లక్ష్యంగా ఎంచుకునే కార్యక్రమాలు, చేపట్టాల్సిన కార్యాచరణను విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరుస్తారన్నారు. విజన్ డాక్యుమెంట్ తయారీకి నీతి అయోగ్‌తో పాటు, ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తారన్నారు. కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో సుస్థిర సమ్మిళిత అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక సదుపాయల వృద్ధితో పాటు మహిళలు, రైతులు, (Farmers) యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. దేశ ఎకానమీలో పదో వంతు సంపదను అందించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి సాధించాలనే భారీ లక్ష్యంతో ఈ విజన్ రూప కల్పన చేయాలని క్యాబినెట్ (Cabinet) అధికారులకు దిశా నిర్దేశం చేసిందని వెల్లడించారు.

అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో స్కూల్స్‌లో మౌలిక సదుపాయాలు, టీచర్ల బదిలీలు నియామకాలు చేశామన్నారు. (Mahabubnagar)మహబూబ్‌నగర్‌లో బాసర ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు కోర్స్‌లకు గాను 240 సీట్లతో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. శాతవాహన యూనివర్సిటీలో లా కాలేజీ ఏర్పాటు‌లో భాగంగా ఎల్‌ఎల్‌బీ 60 సీట్లు, ఎల్‌ఎల్‌ఎమ్‌కు మరో 60 సీట్లలకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర, దేశ వ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతుండడంతో కంట్రోల్ కోసం పద్మ శ్రీ అవార్డు గ్రహీత దత్తాత్రేయని తెలంగాణ క్యాన్సర్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్ పేరుతో అడ్వైసర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ అప్ గ్రేడేషన్‌తో పాటు అన్ని జిల్లాల్లో క్యాన్సర్ కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు.

క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
❄️1. వానాకాలం పెట్టుబడి సాయం రైతు భరోసా
❄️2. తెలంగాణలో ప్రతీ జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాలు
❄️3. హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్‌మెంట్
❄️4. గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించడం
❄️5. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలపై కమిటీ
❄️6. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్‌కు పూర్తి స్థాయి మినిట్స్
❄️7. స్పోర్ట్స్ పాలసీ ఫైనల్
❄️8. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపకల్పన
❄️9. ప్రతి నెలలో రెండు సార్లు క్యాబినెట్, యాక్షన్ టేకెన్‌పై క్వార్టర్‌కు ఓ సారి స్పెషల్ రివ్యూ
❄️10. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీలు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ అప్‌గ్రేడ్, కొత్త మున్సిపాలిటీల్లో కమిషనర్లతో పాటు వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీ

 Also Read: Sand Scam: ఖమ్మం గుమ్మంలో సాండ్ స్కాం.. స్వేచ్ఛ ఎక్స్‌ప్లోజివ్ కథనం

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు