Devineni: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao).. వైసీపీలోకి జంప్ అవుతున్నారని ‘స్వేచ్ఛ’ సంచలన కథనం రాసిన సంగతి తెలిసిందే. ఈ ఎక్స్‌క్లూజివ్ కథనం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమే సృష్టించింది. ఈ వార్త, ఆ నోటా.. ఈ నోటా పడి దేవినేని దగ్గరికి చేరడంతో అసలు ఆయన టీడీపీని వీడాలని అనుకుంటున్నారా? లేదా కంటిన్యూ అవుదామనే అనుకుంటున్నారా? అనే విషయాలపై ఎక్స్ వేదికగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ‘ ప్రజలు 11 సీట్లతో బుద్ధిచెప్పినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఫేక్ ప్రచారాలు మానలేదు. నీ పార్టీ ఉనికి కాపాడు కోవడం కోసం ఇంతలా దిగజారాలా? ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ల ఏడాది సుపరిపాలనా తీరుతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది. ఇటువంటి తప్పుడు పనులు మానకపోతే 2029లో వైసీపీ సింగిల్ సీటు గెలుచుకోవడం కూడా కష్టమే! ’ అని రెండు మాటలతో దేవినేని తేల్చిపడేశారు.
Read Also- YSRCP: ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. వైసీపీలోకి దేవినేని ఉమా?
అసలేం జరిగింది?
వాస్తవానికి 2024 ఎన్నికల ముందు నుంచే దేవినేని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వసంత కృష్ణప్రసాద్‌కు తన కంచుకోటగా ఉన్న మైలవరం నియోజకవర్గాన్ని కట్టబెట్టడం.. పోనీ ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోవడం.. కనీసం కార్పొరేషన్ కూడా ఇవ్వలేదని అధిష్టానంపై ఆగ్రహం.. అంతకుమించి అసహనంతో ఉన్నారు. ఆఖరికి ఊరూ.. పేరు లేని వారికి కూడా ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు కట్టబెట్టి తనను పట్టించుకోలేదన్నది పలు సందర్భాల్లో తన అత్యంత సన్నిహితులు, అనుచరుల దగ్గర వాపోయారట. ఆ తర్వాత నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో పెద్దల సభకు అయినా పంపుతారని చాలా ఆశపడ్డారు కానీ, పెద్దలు మాత్రం ఉసూరుమనిపించారు. ఈ క్రమంలోనే మరింత విసిగిపోయిన ఉమా పార్టీలో పుట్టి పెరిగిన తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదనే విషయాన్ని మరోసారి అనుచరులతో వెల్లగక్కారట. ఈ విషయం ఎలాగో బయటికి లీక్ అయ్యింది. దీంతో ఆయన పార్టీ మారుతున్నారని.. అందులోనూ దేవినేని కుటుంబం అంతా వైసీపీలోనే ఉంటే బాగుంటుందని ఉమా అనుకున్నారనే విషయం బయటికి పొక్కడం ఒక్కసారిగా అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే వార్తలు గుప్పుమన్నాయి.
Read Also- India Vs England: ఇంగ్లండ్‌పై సెంచరీల మోత.. పంత్ సంచలన రికార్డ్
సమగ్ర సమాచారంతో..!
ఉమా మాట్లాడిన మాటలు లీక్ కావడంతో.. ఈ క్రమంలోనే ‘స్వేచ్ఛ’ (Swetchadaily.com) కూడా తనకున్న సోర్సులతో కథనాన్ని ప్రచురించింది. ఎందుకు వైసీపీలోకి చేరాలని అనుకుంటున్నారు? టీడీపీలో ఎందుకు మెలగలేకపోతున్నారు? అనే విషయాలను లోతుగా విశదీకీరించి మరీ.. ఎక్స్‌క్లూజివ్‌గా కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త అటు ప్రభుత్వ వర్గాల్లో.. ఇటు రాజకీయ వర్గాల్లో పెను సంచలనమే సృష్టించింది. అంతేకాదు.. రెండ్రోజులుగా గూగుల్‌లో జనాలు ఎక్కువగా చదివిన వార్తల్లో ఒకటిగా నిలిచింది కూడా. ఈ విషయం దేవినేని చెవిన పడటంతో వైసీపీలో చేరట్లేదని.. టీడీపీలోనే కొనసాగుతానని ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీపైన కూడా తీవ్ర పదజాలంతో కామెంట్స్ చేశారు. దీనికి పెద్ద ఎత్తునే కామెంట్స్ వస్తున్నాయి. ‘ నీ వాళ్ల తెలుగుదేశం పార్టీ కృష్ణ జిల్లాలో సర్వనాశనం అయ్యింది. నిన్ను వైసీపీ పార్టీలోకి తీసుకునే వాడు లేడులే ముందు.. అయినా ఆ దరిద్రం వైసీపీకి ఎందుకు?’ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మరోవైపు.. సొంత పార్టీ కార్యకర్తలు సైతం ‘ ఫేక్ స్టేట్మెంట్ మీరే ఇచ్చుకొని.. మళ్ళీ మీరే ఇలా కవర్ చేసుకుంటున్నారు కదా సార్ సూపర్బ్.. అయినా మిమ్మల్ని ఎవరు పార్టీలో ఉండమన్నారు.. వైసీపీలోకి ఎవరు రమ్మన్నారు సార్?’ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు కూడా పెద్ద ఎత్తునే ఉన్నారు.
Read Also- Tollywood: ‘ముందు పెంచుకో.. ఆ తర్వాతే ఛాన్స్’.. స్టార్ హీరో కుమార్తెకు చేదు అనుభవం!
ప్రజలు 11 సీట్లతో బుద్ధిచెప్పినా @ysjagan ఫేక్ ప్రచారాలు మానలేదు. నీ పార్టీ ఉనికి కాపాడు కోవడం కోసం ఇంతలా దిగజారాలా? ముఖ్యమంత్రి @ncbn, మంత్రి @naralokesh ల ఏడాది సుపరిపాలనా తీరుతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది. ఇటువంటి తప్పుడు పనులు మానకపోతే 2029 లో వైసీపీ సింగిల్ సీటు… pic.twitter.com/cPdwHeXMEm
— Devineni Uma (@DevineniUma) June 23, 2025