YSRCP: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి.. బలమైన సామాజిక వర్గానికి చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao) ‘సైకిల్’ దిగి.. ఫ్యాన్ పార్టీ వైసీపీ గూటికి చేరబోతున్నారా? అతి త్వరలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సమక్షంలో ఈ చేరిక జరగనుందా? వేచి చూసి.. చూసి విసిగి వేసారిన ఉమ ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే తాజా పరిణామాలను, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ ఈయన గురించి ఇలాంటి ప్రచారం, అంతకుమించి వార్తలు వచ్చిన సందర్భాల్లేవ్. తొలిసారి ఇలా హడావుడి జరుగుతుండటం, దీనికి తోడు కనీసం ఆయన ఖండించకపోవడం, కనీసం పార్టీ కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.
Read Also- Pawan Kalyan: మోదీ-పవన్ మధ్య గ్యాప్.. అంతా లోకేషే?
ఎందుకనీ..?
దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ ముఖ్యనేత.. సీనియర్ నేత. అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu) అత్యంత సన్నిహితుడు. గత టీడీపీ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల్లో మైలవరం నుంచి దేవినేనికి టీడీపీ టికెట్ దక్కలేదు. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వసంత కృష్ణప్రసాద్‌కు మైలవరం టికెట్ కేటాయించారు. ఈ పరిణామంతో దేవినేని, ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే.. కూటమి విజయం సాధించినా సరే పార్టీ సంబరాల్లో కానీ, చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. అయితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు గనుక ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగింది. అదీ లేకపోగా.. కనీసం కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అయినా ఇస్తారని ఆశపడ్డారు కానీ ఆ ఊసే లేదు. ఆ తర్వాత రాజ్యసభకు పంపుతారని పెద్ద హడావుడే జరిగింది కానీ.. అబ్బే అదంతా అప్పుడే ముగిసిపోయింది. ఆఖరికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కానీ, తనను పట్టించుకోలేదనే అసంతృప్తి మాత్రం రోజురోజుకూ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తనకు గుర్తింపు లేనిచోట ఉండటం వల్ల ప్రయోజనం లేదని.. పార్టీ మారేందుకు.. అందులోనూ దేవినేని ఫ్యామిలీ అంతా ఒకే పార్టీలో బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. ఇదే జరిగితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామామేనని చెప్పుకోవచ్చు.
Read Also- Atchannaidu: ఇచ్చేయండి సార్.. అచ్చెన్నకు బహుమతి!
మంతనాలు ఇలా..!
ఈ క్రమంలోనే తన సోదరుడి కుమారుడు దేవినేని అవినాష్‌తో (Devineni Avinash) మంతనాలు జరిపారని.. వైఎస్ జగన్‌తో మాట్లాడాలని అతి త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటానని చెప్పినట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ వ్యవహారం పెద్ద బర్నింగ్ టాపిక్ అయ్యింది. వాస్తవానికి కృష్ణా జిల్లాలో టీడీపీ బలంగా ఉన్నది. అందుకే ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ తన పట్టును పెంచుకొని, బలోపేతం కావడానికి ఉమా లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడి కోసమే అధినాయకత్వం వేచిచూస్తోంది. ఇంకా చెప్పాలంటే వైసీపీకి ఉమా ఊపిరి కావొచ్చు కూడా. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత, సీనియర్, అనుభవజ్ఞడైన ఉమా చేరిక వైసీపీకి మంచి బలమేనని చెప్పుకోవచ్చు. ఇదే జరిగితే మాత్రం టీడీపీకి పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా.. పోలవరం వంటి ప్రాజెక్టులపై దేవినేని చేసిన కృషి, రైతు సమస్యలపై పోరాటాలు ఆయనకు బలమైన గుర్తింపును తెచ్చిపెట్టాయన్నది జగమెరిగిన సత్యమే. ఇవన్నీ ఇప్పుడు వైసీపీ వ్యూహాత్మకంగా ఉపయోగడవచ్చు. ఇందులో నిజానిజాలెంతో..? అసలు ఇది ఫేక్‌కా..? అనేది కూడా తెలియట్లేదు. దీనికితోడు అటు ఉమా కానీ.. ఇటు టీడీపీ.. కనీసం వైసీపీ కూడా స్పందించకపోవడం గమనార్హం.
ప్రచారంపై స్పందించలేదు కానీ..
ఇదిలా ఉంటే.. ఈ ప్రచారంపై స్పందించలేదు కానీ జగన్, వైసీపీపై మాత్రం దేవినేని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘అవినీతి, అక్రమాలు, ఫేక్ ప్రచారాలకు వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్. జగన్ రెడ్డి చేష్టల్లో ప్రజలు తనను నమ్మడం లేదన్న అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయం కోసం సొంత బాబాయిని గొడ్డలితో రప్పా.. రప్పా.. నరికించాడు. ఆస్తుల కోసం సొంత తల్లిని, చెల్లిని బయటికి గెంటేశాడు. సమాజంలో విద్వేషాలు వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకున్న కుట్రలు చెల్లవు. ఇటువంటి ఉన్మాద మనస్తత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం’ అని అవినాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also- Gadwal: గద్వాలలో మరో సోనమ్.. పెళ్లయిన నెల రోజులకే భర్త హత్య!
అవినీతి, అక్రమాలు, ఫేక్ ప్రచారాలకు @ysjagan బ్రాండ్ అంబాసిడర్. జగన్ రెడ్డి చేష్టల్లో ప్రజలు తనను నమ్మడం లేదన్న అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయం కోసం సొంత బాబాయిని గొడ్డలితో రప్పా.. రప్పా.. నరికించాడు. ఆస్తుల కోసం సొంత తల్లిని, చెల్లిని బయటికి గెంటేశాడు. సమాజంలో… pic.twitter.com/PS4OfqkLzD
— Devineni Uma (@DevineniUma) June 22, 2025
బిగ్ బ్రేకింగ్
వైఎస్ఆర్సీపీ లోకి దేవినేని ఉమా అతి తొందరలో pic.twitter.com/BBmO3YXChj
— SRP 🚩 (@SRP_Rebel) June 21, 2025