Kinjarapu Atchannaidu
ఆంధ్రప్రదేశ్

Atchannaidu: ఇచ్చేయండి సార్.. అచ్చెన్నకు బహుమతి!

Atchannaidu: ‘జాతిరత్నాలు’ సినిమాలో ఫరియా అబ్దుల్లా కోర్టులో మాట్లాడిన డైలాగ్ గుర్తుందా? అదేనండోయ్ ‘లా’ గురించి తెలిసీ తెలియక ‘ ఇచ్చేయండి సార్.. ఇచ్చేయండి బెయిల్’ మాట్లాడుతుందే.. హా గుర్తుకొచ్చింది కదా..! సరిగ్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) మాటలు విన్నాక ఆ సీన్ గుర్తుకొస్తుంది. నెటిజన్లు ఈ రెండు సన్నివేశాలను పొల్చుకుంటూ.. ‘ బాబుగారు ఇచ్చేయండి సార్.. అచ్చెన్నకు బహుమతి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ గిఫ్ట్ కథ ఏంటి? మధ్యలో బాబు ఎందుకొచ్చారు? అనే కదా మీ డౌట్.. అక్కడికే వస్తున్నా ఆగండి..!

Jathirathnalu

Read Also- Yoga Day: బాబోయ్.. మహిళలకు యోగా నేర్పించారా.. కరాటేనా?

అసలేం జరిగిందంటే..?
విశాఖపట్నంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసిన ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది.. గిన్నిస్‌లో చోటు కూడా దక్కింది. ఈ కార్యక్రమం గురించి, సీఎం చంద్రబాబు తన చేసిన కామెంట్స్‌పై మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఒకింత నవ్వు వస్తుంది.. అంతకుమించి ఛాలెంజ్‌గా తీసుకొని సక్సెస్ అయ్యారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ‘ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నా పర్సనాలిటీ చూసి, నా వెయిట్ (బరువు) చూసి.. అచ్చెన్న మీరు కూడా యోగా ప్రాక్టీస్ చేయలేకపోతే ఈ కార్యక్రమానికి రావొద్దని చెప్పారు. అందుకే పట్టుదలగా తీసుకొని యోగాసనాలు చేశాను. ప్రాక్టీస్ లేకపోయినా సరే దృఢమైన విశ్వాసంతో చేశాను. నాకు తెలిసి వ్యక్తిగతంగా చూసినా, వ్యక్తిగతంగా బహుమతులు ఏవైనా ఇస్తే నాకే మొదటి బహుమతి ఇవ్వాలి. ఎందుకంటే అంత క్రమశిక్షణతో ఏదైతే ఆచరించారో.. పిన్ టూ పిన్ నేను కూడా చాలా నీట్‌గా చేశాను. అక్కడ వాళ్లు ఏవిధంగా అయితే చేశారో ఆ విధంగా చేశాను. చాలా ఆనందంగా ఉంది’ అని అచ్చెన్నాయుడు ఎంతో హ్యాపీగా ఫీలవుతూ చెప్పారు. మొత్తానికి చూస్తే.. పాపం అచ్చెన్న యోగాసనాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక్కోసారి ఆయన మీద ఆయనకే నమ్మకం ఉండదు. అలాంటిది ఎంతో ఏకాగ్రతతో.. పట్టుదలగా చేయడం అంటే మామూలు సంగతేమీ కాదు. అందుకే నెటిజన్లు కూడా.. ‘ బాబుగారూ.. అచ్చెన్నకు బహుమతి ఇచ్చేయండి’ అని నెటిజన్లు గట్టిగానే కోరుతున్నారు. మరి చంద్రబాబు ఇస్తారో లేదో చూడాలి. చూశారుగా.. ఇప్పుడు చెప్పండి.. అచ్చెన్నాయుడిని మెచ్చుకోకుండా ఉంటారా! పోనీ ఎంత విరోధులు అయినా, వేరే పార్టీ వాళ్లు అయినా.. ఆఖరికి విమర్శకులు అయినా సరే అచ్చెన్న యోగాసనాలను మెచ్చుకోవాల్సిందేనని కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి.

Atchannaidu Yoga

ఉత్తరాంధ్ర పవర్!
‘ అంతర్జాతీయ యోగా వేడుకలు ఉత్తరాంధ్రలోని సుందరమైన వైజాగ్‌లో నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గత నెల 21న యోగాంధ్ర అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ కార్యక్రమం ఉదయాన్నే కాబట్టి ప్రజలు ఎలా వస్తారో..? ఏంటో అని కాస్త భయపడ్డాం. ఈ నెల రోజులూ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అంతా వచ్చి జనాలను చైతన్య పరచడంతో కార్యక్రమానికి తరలివచ్చారు. నా జీవితంలో ఇంతవరకూ, ఇంత ఉత్సాహంతో రావడాన్ని ఎప్పుడూ చూడలేదు. అందులోనూ అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఈ రోజు చరిత్ర సృష్టించారు. ఐదు లక్షల మంది యోగాంధ్రకు హాజరువుతారని చెబితే అనుకున్నట్లుగానే జరిగింది. డైరెక్టుగా మూడు లక్షలు దాటి అటెండ్ అయ్యారు. కాబట్టి ఈరోజు ప్రపంచ రికార్డు సాధించడం, అందులోనూ ఉత్తరాంధ్రలో రికార్డు సాధించడం చాలా సంతోషంగా ఉంది’ అని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Babu and Atchanna
 

Read Also- Niharika Konidela: ఆ హీరోతో నా రిలేషన్ ఐదేళ్లు.. లవ్ సింబల్ తో హింట్ ఇచ్చిన నిహారిక కొణిదెల?

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు