Yogandhra Fight
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Yoga Day: బాబోయ్.. మహిళలకు యోగా నేర్పించారా.. కరాటేనా?

Yoga Day: హెడ్డింగ్ చూడగానే అందులో సందేహం ఏముంది.. ఇవాళ యోగా డే కాబట్టి యోగానే నేర్పిస్తారు కదా? అని అనుకున్నారు కదూ..! కానీ, ఈ వార్త చదివిన తర్వాత మీకే లేనిపోని సందేహాలు రావడం కామన్. ఇంకెందుకు ఆలస్యం చకచకా చదివేయండి మరి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘యోగాంధ్ర’ (Yogandhra) కార్యక్రమం నిర్వహించింది. 3.01 లక్షల మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేయడంతో గిన్నిస్‌ రికార్డు కూడా సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి విచ్చేయడం.. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అక్కడ చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు చూస్తే.. బాబోయ్ ఇంత దారుణమా? అనే మాట ఆటోమాటిక్‌గా మీ నోట వచ్చేస్తుంది అంతే..!

అసలేం జరిగింది?
యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన కొంతమంది మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు యోగా మ్యాట్‌లను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన విస్తృతంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు.. మరీ ముఖ్యంగా మ్యాట్‌ల కోసం మహిళలు కొట్టుకోవడం గమనార్హం. ఒకరి చేతుల్లో నుంచి మరొకరు మ్యాట్‌లను లాక్కోవడానికి ప్రయత్నించారు. ఇంకొందరైతే జుట్లు పట్టుకొని కూడా కొట్టుకున్నారు. పోనీ.. ఒక్క మ్యాట్ మాత్రమే తీసుకెళ్లారా? అంటే అదేం లేదు. రెండు, మూడు, నాలుగు.. ఎన్ని దొరికితే అన్ని తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై నెట్టింట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి.. యోగాంధ్ర  ఏర్పాట్లలో భాగంగా 5 లక్షల యోగా మ్యాట్‌లను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ యోగా మ్యాట్, టీ-షర్ట్ అందజేయాలని ‘హార్ట్ ఫుల్‌నెస్’ సంస్థ నిర్వాహకులు ముందుగానే ప్రకటించారు. యోగా ప్రదర్శన అనంతరం వీటిని తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని కూడా తెలిపారు. అయితే, కొంతమంది జనాలు మాత్రం కార్యక్రమం ముగియకముందే మ్యాట్‌లను తీసుకెళ్లడం మొదలుపెట్టారు. కొందరు మహిళలు తమతో పాటు బంధువులకు కూడా కలిపి ఎక్కువ మ్యాట్‌లను తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటనపై నెటిజన్లు చిత్రవిచిత్రాలుగా స్పందిస్తున్నారు. కొందరు తప్పుబట్టగా, మరికొందరు నిర్వాహకుల వైపు నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరైతే.. ‘ ఇంతకీ మహిళలతో యోగా చేయించారా ? కరాటే నేర్పించారా?’ అని సెటైర్లు వేస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. యోగా చేయడానికి వచ్చిన వారికి మ్యాట్స్‌ను అధికారులు సరిగ్గా అందించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. అధికారుల నిర్లక్ష్యంతో యోగ కార్యక్రమంలో గందరగోళం నెలకొన్నది. అయితే.. పోలీసులు ఉన్నప్పటికీ చేతులెత్తేసిన పరిస్థితి నెలకొన్నది.

Read Also- Venu Madhav: నడిచి వస్తున్న వేణుమాధవ్.. గుండెలు పిండేసే వీడియో వైరల్!

భోజనాల కోసం..
యోగాంధ్ర కార్యక్రమంలో ఫుడ్ ప్యాకెట్ల కోసం జనాలు ఎగబడ్డారు. కాగా, యోగా కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ ఫుడ్ ప్యాకెట్లు కూడా అందిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. అయితే, కార్యక్రమానికి వచ్చిన జనాల సంఖ్య భారీగా ఉండటం, పంపిణీలో సరైన సమన్వయం లేకపోవడంతో గందరగోళం నెలకొన్నది. చాలా మంది ఆహార ప్యాకెట్ల కోసం ఎగబడటంతో, తోపులాటలు జరిగి, పరిస్థితి అదుపుతప్పింది. ఫుడ్ ప్యాకెట్లు త్వరగా అయిపోతాయనే భయంతో ప్రజలు ఒకరినొకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీనివల్ల తోపులాటలు జరిగాయి. కొందరు కిందపడ్డారు కూడా. భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నప్పటికీ, పంపిణీకి సరిపడా ఏర్పాట్లు లేకపోవడం లేదా సిబ్బంది కొరత వంటి కారణాల వల్ల ఈ గందరగోళం తలెత్తింది. నిర్వాహకులపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు, కనీసం ఆహారం, నీరు వంటి ప్రాథమిక అవసరాల పంపిణీలోనూ వైఫల్యం చెందారని పలువురు ఆక్షేపించారు. అటు యోగా మ్యాట్‌లు ఎత్తుకెళ్లిన ఘటన.. ఫుడ్ ప్యాకెట్ల గొడవ కూడా ఈ భారీ ఈవెంట్ నిర్వహణలో లోపాలను ఎత్తి చూపింది. ఇదిలా ఉంటే.. ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరిగినప్పటికీ కార్యక్రమం మాత్రం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా పూర్తయింది.

పిల్లలకు తిప్పలు..
యోగా డే సందర్భంగా విద్యార్థులకు కూడా తిప్పలు తప్పలేదు. గిన్నిస్ రికార్డు కోసం ఏజెన్సీ ప్రాంతాల నుంచి పిల్లల‌ను విశాఖ‌కు త‌ర‌లించిన రాష్ట్ర ప్రభుత్వం సరైన వసతులు కల్పించలేదు. సమయానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని విద్యార్థులు వాపోతున్నారు. రాత్రి నిద్రకూ వసతి కల్పించలేద‌ని, దోమలతో తీవ్ర పిల్లలు ఇబ్బంది పడ్డారు. దీనిపై వైసీపీ స్పందిస్తూ.. ‘ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గిన్నీస్ రికార్డు కోసం గిరిజ‌న విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాట‌మా చంద్రబాబు, నారా లోకేష్ , పవన్ కళ్యాణ్? ఇక్కడ చూడండి స‌రైన సౌక‌ర్యాలు లేక విద్యార్థులు ఎన్ని అవ‌స్థలు ప‌డుతున్నారో..?’ అని ఎక్స్ వేదికగా మండిపడింది. ఈ వరుస ఘటనలపై.. వైసీపీ విమర్శలపై ప్రభుత్వం నుంచి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.

Read Also- Snake in Metro: మెట్రో లేడీస్ కోచ్‌లోకి పాము?.. వీడియో చూస్తే..

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు