GHMC Commissioner Karnan: రాజకీయ, ఆర్థిక పలుకుబడి, పైరవీలతో (GHMC) జీహెచ్ఎంసీలో పోస్టింగ్‌లు దక్కించుకునే వారికి కమిషనర్ కర్ణన్ (Karnan) చెక్ పెట్టారు. జీహెచ్ఎంసీకి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఏళ్లుగా సీట్లకు అతుక్కుపోయిన అదనపు కమిషనర్ల సంఖ్యను కమిషనర్ కర్ణన్ కుదించారు. పాటు మరి కొందరిని సీడీఎంఏకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే మరోసారి అదనపు కమిషనర్ల సంఖ్యను కుదించే దిశగా కసరత్తు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ (BRS) పాలనలో ఆర్థిక, రాజకీయ పలుకుబడి, సచివాలయ స్థాయి పైరవీలతో పోస్టింగ్‌లను మెన్షన్ చేస్తూ ఉత్తర్వులు తెచ్చుకునే వారు. కానీ, ఇప్పుడు ఆ పాత పద్దతికి చెక్ పెట్టిన కమిషనర్ క్యాడర్‌కు తగిన విధంగా పోస్టింగ్‌లు కేటాయించనున్నట్లు రెండు రోజుల క్రితం గ్రేడ్-2, 3లకు చెందిన మున్సిపల్ కమిషనర్లకు (GHMC) జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లోని సర్కిల్, జోన్లలో పోస్టింగ్‌లు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో భాగంగానే అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ క్యాడర్‌కు చెంది, ప్రస్తుతం గోషామహల్ సర్కిల్ ఇన్‌ఛార్జ్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న లావణ్యను డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్ ఎల్బీనగర్ (LB Nagar) జోన్‌కు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో మున్సిపల్ గ్రేడ్ -2 కమిషనర్‌ను డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు మొత్తం 12 మంది గ్రేడ్-2, 3 కమిషనర్లకు కర్ణన్ పోస్టింగ్‌లు ఇవ్వగా, అందులో ఏడుగురు మహిళాధికారులే ఉన్నారు.
Also Read:Konda couple: రేవంత్‌ను పదేండ్లు సీఎంగా చూడాలనేది కల.. కొండా దంపతుల ప్రకటన!
ఇకపై పైరవీలు చేసుకుని, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పోస్టింగ్‌ల కోసం ప్రయత్నించే వారికి ఫలితం దక్కదంటూ ఆయన తన ఉత్తర్వులతో పరోక్షంగా సంకేతాలిచ్చినట్లు భావించవచ్చు. ఇలాంటి నియామకాలు, పోస్టింగ్‌లు 2014 నుంచి 2023 మధ్య చాలా జరిగాయి. దీనికి తోడు రిటైర్డ్ అయిన అధికారులు సైతం ఓఎస్డీలుగా సర్కారు నుంచి నియామక పత్రాలు తెచ్చుకుని (GHMC) జీహెచ్ఎంసీలో ఏళ్ల తరబడి అదనపు కమిషనర్లుగా విధులు నిర్వహించిన దాఖలాలు ఉన్నట్లు గుర్తించిన కమిషనర్ ఇకపై ఇలాంటి పోస్టింగ్‌లు జరగకుండా చెక్ పెడుతున్నారు.
మళ్లీ కదలనున్న సీట్లు
ఇప్పటి వరకు టౌన్ ప్లానింగ్‌లో భారీ బదిలీలు చేసిన కమిషనర్ త్వరలోనే అదే విభాగంలో మరి కొందరి సీట్లను కదలించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సర్కిల్ స్థాయిలో టౌన్ ప్లానింగ్ (Town planning) విధులు నిర్వర్తించే అసిస్టెంట్ సిటీ ప్లానర్ల పనితీరుపై కమిషనర్ నిఘా పెట్టినట్లు తెలిసింది. త్వరలోనే 30 సర్కిళ్లలోని అసిస్టెంట్ సిటీ ప్లానర్లను జోనల్ స్థాయిలో బదిలీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంతో పాటు ప్రతి రోజు సాయంత్రం సందర్శకుల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో సగానికి పైగా టౌన్ ప్లానింగ్‌కు చెందినవే కావడంతో వాటి పరిష్కారానికి చీఫ్ సిటీ ప్లానర్‌కు డైలీ సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు తన ఛాంబర్‌లో డ్యూటీ వేసిన కమిషనర్ టౌన్ ప్లానింగ్‌లో త్వరలో భారీ ప్రక్షాళనకు సిద్ధమైనట్లు తెలిసింది.
దీనికి తోడు ఏళ్లుగా తిష్టవేసిన డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లను కూడా బదిలీలు చేయాలని కమిషనర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించి ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్లుగా, మెడికల్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్నవారు ఎప్పటి నుంచి జీహెచ్ఎంసీలో పని చేస్తున్నారు? వారి మాతృ శాఖ ఏదీ? డిప్యుటేషన్లపై ఎంత మంది కొనసాగుతున్నారు? అన్న సమాచారాన్ని కమిషనర్ ఇప్పటికే తెప్పించుకున్నట్లు తెలిసింది.
Also Read: MP Crime: ఇదేం దిక్కుమాలిన కేసు.. ప్రియుడి కోసం అమ్మాయిగా మారిన అబ్బాయి.. చివరికి!