Konda couple(image credit: swetcha reporter0
Politics

Konda couple: రేవంత్‌ను పదేండ్లు సీఎంగా చూడాలనేది కల.. కొండా దంపతుల ప్రకటన!

Konda couple:  భార‌త్ జోడో యాత్రతో దేశంలోని ప్రతి పేద‌వాడి సమస్యలు తెలుసుకుంటూ, ముందుకు క‌దులుతున్న రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయ‌డ‌మ‌ని త‌న లక్ష్యమని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి (Konda Murali) పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) మరో పదేళ్ల పాటు అదే కూర్చీలో చూడాలన్నది తన టార్గెట్ అన్నారు. ఇక బీసీ పీసీసీ చీఫ్​‌కు తన సపోర్ట్ అన్ని వేళల్లోనూ ఉంటుందన్నారు. తాను బీసీన‌ని, బీసీల కోసం క‌డ‌దాకా కొట్లాడుతానంటూ ప్రకటించారు.

 Also Read: Baba Vanga Prediction: 900 సార్లు భూకంపం.. వంగా జోస్యం నిజం కాబోతోందా.. ప్రళయం తప్పదా!

ఆయన మంత్రి (Konda Surekha) కొండా సురేఖతో కలిసి కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ (Meenakshi Natarajan) మీనాక్షి న‌ట‌రాజ‌న్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ (Warangal) జిల్లాలో జ‌రుగుతున్న తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆమెకు కొండా దంప‌తులు సుదీర్ఘంగా వివ‌రించారు. వారు చెప్పిన అంశాలు మీనాక్షి న‌ట‌రాజ‌న్ (Meenakshi Natarajan) సావ‌ధానంగా విన్నట్లు తెలిపారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్ళగా, అన్ని అంశాలు ప‌రిష్కరిస్తాన‌ని మీనాక్షి సానుకూలంగా చెప్పిన‌ట్టు కొండా దంపతులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కొండా మురళి (Konda Murali) మాట్లాడుతూ, తాను అణగారిన వర్గాల కోసం ప‌ని చేస్తాన‌ని, ఆ వ‌ర్గంలో తాను బ‌లమైన నేత‌ను అయిందున అంద‌రూ త‌న ద‌గ్గరికి వ‌స్తార‌ని చెప్పారు. పేదల సమస్యలు తీర్చుతున్నానని, కాబట్టే జనం త‌న‌ దగ్గరికి వస్తార‌ని చెప్పుకొచ్చారు. త‌న‌కి ప్రజాబలం ఉన్నదని, పనిచేసే వారిపైనే రాళ్ళు వేస్తార‌న్నారు. పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా, గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని మీనాక్షి (Meenakshi Natarajan)తో చెప్పాన‌ని పేర్కొన్నారు.

 Also Read: Sigachi Blast: సిగాచి పేలుడు వేదన.. కడసారి చూపు దక్కక మృతుల కుటుంబాల కంటనీరు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!