GHMC Commissioner: కొద్ది రోజుల క్రితం సిటీలో అంగరంగ వైభవంగా జరిగిన గణేశ్ నిమజ్జనోత్సవంలో జీహెచ్ఎంసీకి చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు ప్రమాదవశాత్తు టస్కర్ కింద పడి మృతి చెందిన ఘటనతో జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) ఆర్.వి. కర్ణన్ (R.V. Karnan) పారిశుద్ధ్య కార్మికులు, వారి ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కార్మికులకు అమలవుతున్న ఇన్సూరెన్స్ ను రూ. 8 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచేందుకు కూడా ఆయన సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుని, త్వరలోనే ఈ ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీ ముందు పెట్టనున్నారు. నిమజ్జనం జరిగిన ఈ నెల 6వ తేదీన పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక మృతి చెందిన రోజే కార్మికుల భీమా పై కమిషనర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో చర్చించినట్లు, అందుకు ఆమె సానుకూలంగా స్పందించటంతో కార్మికుల భీమా రూ. 30 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదనలను సిద్దం చేసినట్లు సమాచారం.
Also Read: Ilaiyaraaja: అమ్మవారికి డైమండ్ కిరీటం సమర్పించిన మ్యూజిక్ డైరెక్టర్.. విలువ ఎంతంటే?
దీంతో పాటు మరో అడుగు ముందుకేసిన కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులు లేకుండా సిటీలో జనం జీవించటం చాలా కష్టమని గుర్తించిన ఆయన వారి సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ వంటి విషయాలపై కూడా దృష్టి సారించారు. పగలు, రాత్రి అంటూ తేడా లేకుండా, అర్థరాత్రి సైతం రోడ్లపై ప్రమాదం అంచున విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం మరిన్ని హెల్త్ క్యాంప్ లను నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ముందస్తుగా చికిత్స అందించవచ్చు
ఉదయాన్నే వారు దుమ్ము, దూళిలో విధులు నిర్వహిస్తున్నందున, అది వారి ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపుడుతుందన్న విషయాన్ని గుర్తించిన కమిషనర్ కార్మికులకు ముందుగానే వివిధ రకాల మెడికల్ టెస్టులు నిర్వహించి, ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ముందస్తుగా చికిత్స అందించవచ్చునని భావిస్తున్నట్లు తెలిసింది. కానీ కొద్ది రోజుల క్రితం పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లలో కార్మికులు పలు మెడికల్ టెస్టులు చేయించుకునేందుకు భయపడ్డారని, టెస్టుల్లో ఏదైనా సమస్య బయట పడితే వారు తమ ఆర్థిక స్తోమత ప్రకారం వైద్యం ఖర్చులను భరించలేదన్న భయంతోనే ఎక్కువ మంది కార్మికులు టెస్టులు చేయించుకోలేదన్న విషయాన్ని గుర్తించిన కమిషనర్, ముందస్తు మెడికల్ టెస్టులపై కార్మికుల్లో అవగాహన కల్పించి, వారికి ముందస్తుగా పలు టెస్టులను నిర్వహించి, అవసరమైన వారికి తగ్గిన వైద్య సేవలను అందించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Also Read: Pooja Hegde: పూజా హెగ్డేకు మరో ఛాన్స్.. హీరో ఎవరంటే?