Pooja Hegde: పూజా హెగ్డేకు మరో ఛాన్స్.. హీరో ఎవరంటే?
DQ41 First Look
ఎంటర్‌టైన్‌మెంట్

Pooja Hegde: పూజా హెగ్డేకు మరో ఛాన్స్.. హీరో ఎవరంటే?

Pooja Hegde: పూజా హెగ్డే.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు బాగానే పరిచయం ఉంది. కొన్నాళ్ల పాటు కుర్రాళ్ల కలలరాణిగా, టాలీవుడ్‌లో దుమ్మురేపిన ఈ బుట్టబొమ్మకు.. ఈ మధ్యకాలంలో అస్సలు కలిసి రావడం లేదు. ఏది పడితే అది ఫట్ అన్నట్లుగా, ఆమె ఏ సినిమా చేసినా, అది బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతూనే ఉంది. ఈ క్రమంలో టాలీవుడ్ వదిలి ఇతర ఇండస్ట్రీలలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లిన పూజాకు.. అక్కడ కూడా గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఇటీవల సూర్య సరసన నటించిన ‘రెట్రో’ చిత్రం దారుణ పరాజయాన్ని చవిచూసింది. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘కూలీ’ సినిమాలో ఓ సాంగ్ చేసినా, సాంగ్ పెద్ద హిట్ అయినా, నిర్మాతకు మాత్రం ఆ సినిమా భారీగానే నష్టాన్ని మిగిల్చింది. దీంతో పూజా ఖాతాలో కూడా మరో లాస్ వెంచర్ చేరినట్లయింది. ఇక ఆమె చేతిలో కేవలం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ ఫిల్మ్‌గా చెప్పుకుంటున్న ‘జననాయగన్’ మాత్రమే ఉందని అంతా అనుకుంటున్న సమయంలో.. ఇప్పుడు సడెన్‌గా ఆమెను మరో అవకాశం వరిచింది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Nagababu: మెగా లిటిల్ ప్రిన్స్‌‌పై మెగా బ్రదర్ రియాక్షన్ ఇదే.. పట్టలేనంత ఆనందంలో!

దుల్కర్ సరసన పూజా హెగ్డే

వర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) 41వ చిత్రం (#DQ41)‌లో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ అంటూ మేకర్స్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రంతో రవి నేలకుదిటి (Ravi Nelakuditi) దర్శకుడిగా పరిచయం అవుతుండగా, SLV సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. SLV సినిమాస్‌లో వస్తున్న 10వ చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా హ్యూమన్ డ్రామాతో పాటు అద్భుతమైన ప్రేమకథ ఇందులో ఉంటుందని, ఎమోషనల్‌గా అందరికీ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అంతేకాదు, దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కలిసి ఉన్న ఓ పిక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ నామినేషన్సే ఇంత వైలెంట్‌గా ఉన్నాయేంట్రా బాబు..?

DQ41 ఫస్ట్ లుక్ విడుదల

పూజా హెగ్డే ఇందులో నటిస్తుందని, ప్రస్తుతం షూటింగ్‌లో జాయిన్ అయిందని తెలుపుతూ విడుదల చేసిన ఈ పిక్‌లో పూజా హెగ్డే స్కూటీ నడుపుతుంటే.. దుల్కర్ వెనుక కూర్చుని ఉన్నారు. ఈ ఫస్ట్ లుక్ వారి మ్యాజికల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తోంది. ఈ మధ్యకాలంలో దుల్కర్ సల్మాన్.. తెలుగు నిర్మాత, దర్శకులతో చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్టయ్యాయి. ‘మహానటి, కల్కి 2898 AD, లక్కీ భాస్కర్’.. ఇలా తెలుగులో ఆయనకు మంచి సక్సెస్ రేట్ ఉంది. అలాగే తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయన మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చేస్తున్న సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పూజా హెగ్డే కూడా టాలీవుడ్‌లో గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆమె ఈ సినిమాలో చేస్తుందని తెలిసి.. అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..