GHMC ( image credit: twitter)
హైదరాబాద్

GHMC: జీహెచ్ఎంసీ బడా మాల్స్‌పై దృష్టి.. మరో వంద నోటీసుల జారీకి ఛాన్స్!

GHMC: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు జీహెచ్ఎంసీ (GHMC) అందుబాటులో ఉన్న అన్ని ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుంటుంది. ఇందులో భాగంగా సిటీలోని మొత్తం 30 సర్కిళ్ల పరిధిలోని వందల సంఖ్యలో ఉన్న బడా మాల్స్ ఆస్తి పన్ను చెల్లిస్తున్నాయా? ట్రేడ్ లైసెన్సులు తీసుకున్నాయా? లేదా? చేస్తున్న వ్యాపారానికి తగిన విధంగా ట్రేడ్ లైసెన్స్ లు తీసుకున్నాయా? ట్యాక్స్ కమర్షియల్ చెల్లిస్తున్నాయా? రెసిడెన్షియల్ చెల్లిస్తున్నాయా? అన్న విషయాన్ని ఫీల్డు లెవల్ లో కరెక్షన్ చేసుకునేందుకు ఇటీవల కమిషనర్ అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు, ట్యాక్స్ స్టాఫ్ కు సర్క్యులర్ జారీ చేయటంతో సర్కిల్ సిబ్బంది మొత్తం బడా మాల్స్ పై దృష్టి పెట్టాయి. ఇప్పటి వరకు 30 సర్కిళ్ల పరిధిలో సుమారు 200 వరకు బడా మాల్స్ ను గుర్తించి, నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:GHMC: జీహెచ్ఎంసీ పనుల్లో అలసత్వానికి చెక్.. పనుల వేగం కోసం డ్యాష్ బోర్డు ఏర్పాటు 

వీటిలో చాలా వరకు మాల్స్ పేరుగాంచిన సీఎంఆర్, జీవీకే, పోర మాల్స్, హైదరాబాద్ సెంట్రల్ మాల్ వంటి ఇతర బడా మాల్స్ ఉన్నట్లు సమాచారం. మొత్తం 30 సర్కిళ్ల పరిధిలో సుమారు 300 వరకు బడా మాల్స్ ఉన్నట్లు అంచనా వేసిన అధికారులు కమిషనర్ సర్క్యులర్ జారీ చేసిన ఈ నెల 8వ తేదీ నుంచి సోమవారం మధ్యాహ్నాం వరకు సుమారు రెండు వందల మాల్స్ కు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అధికారుల అంచనాల ప్రకారం ఇంకా మిగిలిన వంద మాల్స్ కు అధికారులు కమిషనర్ విధించిన మంగళవారం సాయంత్రం డెడ్ లైన్ వరకు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. కాగా, త్వరలో ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మాల్స్ ను మాత్రం ఈ డ్రైవ్ లో భాగంగా నోటీసుల జారీ ప్రక్రియ నుంచి మినహాయించారు. వచ్చే నెల 14వ తేదీన ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఈ నియోజకవర్గంలోని మాల్స్ లకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూచించినట్లు తెలిసింది.

నోటీసుల జారీ ఉద్దేశ్యం ఏమిటీ?

సిటీలోని ఆరు జోన్లలో కలిపి సుమారు 93 వేల ఆస్తులు కమర్షియల్ కరెంటు మీటర్లను వినియోగిస్తూ, వాటిల్లో కమర్షియల్ కార్యకలాపాలు కొనసాగిస్తూ జీహెచ్ఎంసీ కి మాత్రం రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ ను చెల్లిస్తున్నట్లు ఇటీవలే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్ ) ద్వారా గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ తర్వాత సిటీలోని బడా మాల్స్ పై దృష్టి సారించారు. ఎక్కువ వ్యాపారాలు జరిగే మాల్స్ కూడా తగిన విధంగా ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నాయా? అన్న అనుమానంతో వాటికి నోటీసులు జారీ చేస్తున్నారు.

నోటీసుల తర్వాత యజమానులిచ్చే వివరణ బట్టి, మాల్స్ చెల్లిస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్ ను కమర్షియల్ కిందకు బదలాయించాలని, అలాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజును మాల్స్ కు తగ్గట్టు వర్తింపజేయాలన్న ఉద్యేశ్యంతోనే అధికారులు మాల్స్ లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఈ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ పీజుల చెల్లింపు కరెక్షన్ తో జీహెచ్ఎంసీ ఎంతో కొంత ఆదాయం శాశ్వత ప్రాతిపదికన సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. నోటీసులకు స్పందించని యాజమాన్యాలను గుర్తించి రెడ్ నోటీసులు జారీ చేసి, సీజ్ చేసే ఆలోచనలో కూడా బల్దియా అధికారులున్నట్లు సమాచారం.

తదుపరి టార్గెట్ హోటల్స్, హాస్పిటల్స్

ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల రివిజన్ కోసం జీహెచ్ఎంసీ బడా మాల్స్ పై చేపట్టిన డ్రైవ్ ముగిసిన వెంటనే సిటీలోని మూడు, అయిదు, ఏడు నక్షత్రాల హోటల్స్ ను టార్గెట్ చేసుకుని ఈ డ్రైవ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. హోటల్స్ ఎక్కువగా ఉన్నందున, వీటి ప్రక్రియ ముగిసిన తర్వాత హాస్పిటల్స్ పై కూడా డ్రైవ్ నిర్వహించి ఆదాయాన్ని పెంచుకోవాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత పెట్రోల్ బంక్ లపై డ్రైవ్ నిర్వహించిన తర్వాత ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న బడా అపార్ట్ మెంట్లు, వ్యక్తిగత నివాసాలు, గెస్ట్ హౌజ్ లు, గెటెడ్ కమ్యూనిటీల ట్యాక్స్ చెల్లింపులపై ఈ డ్రైవ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Also Read: GHMC: రేపటికి వాయిదా పడ్డ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?