GHMC Award: తెలంగాణలో స్వచ్ఛ షహర్‌గా గ్రేటర్ హైదరాబాద్
GHMC Award ( IMAGE credit: swetchareporter)
హైదరాబాద్

GHMC Award: తెలంగాణలో స్వచ్ఛ షహర్‌గా గ్రేటర్ హైదరాబాద్

GHMC Award:  దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డుల్లో ఈసారి జీహెచ్‌ఎంసీ మెరుగైన ర్యాంకుతో పాటు అనేక అవార్డులను దక్కించుకుంది. తెలంగాణలోనే ‘స్వచ్ఛ షహర్’గా గ్రేటర్ హైదరాబాద్ ఎంపికైంది. గత సంవత్సరం 9వ ర్యాంకుతో ఫైవ్ స్టార్స్ ర్యాంకు పొందిన గ్రేటర్ హైదరాబాద్, ఈసారి టాప్ టెన్ నగరాల్లో స్థానాన్ని పదిలం చేసుకుని సెవెన్ స్టార్స్ హోదాను సాధించింది.

 Also Read: Hyderabad Heavy Rains: నగరంలో భారీ వర్షం .. ట్రాఫిక్‌తో వాహనదారుల ఇక్కట్లు

6వ ర్యాంకు

స్వచ్ఛ్ సర్వేక్షణ్-2024 సర్వేలో 10 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన ‘వ్యర్థాల రహిత నగరం’ కేటగిరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, 6వ ర్యాంకును సాధించినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో పాటు, ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ వాటర్ ప్లస్ సర్టిఫికెట్ను కూడా జీహెచ్‌ఎంసీ దక్కించుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో  న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ కార్యక్రమంలో, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ చేతుల మీదుగా జీహెచ్‌ఎంసీకి లభించిన స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులను పురపాలక, పట్టణాభివృద్ధి కార్యదర్శి డాక్టర్ కె. ఇలంబర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌తో కూడిన అధికారుల బృందం స్వీకరించింది.

 Also Read: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. మరో 10 ట్రెయిన్‌లు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..