H-City Project ( iamage credit: twitter)
హైదరాబాద్

H-City Project: హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్.. రూ.5942 కోట్లతో కొత్త రోడ్ ప్రాజెక్టులు ప్రారంభం

H-City Project: గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్, రద్దీ నుంచి వాహనదారులకు ఉపశమనం కల్గించేందుకు గత పాలకులు ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్(Road) డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్ డీపీ) కింద సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదించిన పనులను ప్రస్తుత సర్కారు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటీవ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటీవ్, ఇన్ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టు (హెచ్ సిటీ) కిందకు బదలాయించి పరిపాలన పరమైన మంజూరీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గత సంవత్సరం డిసెంబర్ నెలలో శంకుస్థపాపన చేసినా, నేటికీ ఒక్క ప్రాజెక్ర్టు పనులు ప్రారంభించకపోవటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 Also Read: H-CITI Project: హెచ్ సిటీ పనులు స్పీడప్.. సర్కారుకు ఏజెన్సీల జాబితా!

రూ. 5942 కోట్లతో 23 ప్రాజెక్టులు,

దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ విభాగంలోని ప్రాజెక్టు వింగ్ పై రెండు సార్లు సమీక్షలు నిర్వహించిన కమిషనర్ హెచ్ సిటీ కింద ఇప్పటికే టెండర్లను ఖరారు చేసిన కేబీఆర్ పార్కు చుట్టూ పనులెందుకు మొదలు కావటం లేదన్న విషయంపై ఆయన సీరియస్ కావటంతో ఎట్టకేలకు హెచ్ సిటీ పనులకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలిసింది. వచ్చే మార్చి మాసం కల్లా అయిదు ప్యాకేజీల కింద రూ. 5942 కోట్లతో 23 ప్రాజెక్టులు, కేబీఆర్ పార్కు చుట్టూ రూ.1090 కోట్లతో ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, ఆరు అండర్ పాస్ లతో కలిపి మొత్తం రూ.7032 కోట్లను హెచ్ సిటీ పనులకు వెచ్చించనున్నారు.

వీటిలో ఇప్పటికే కేబీఆర్ పార్కు చుట్టూ పనులకు, నానల్ నగర్ మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయగా, వచ్చే మార్చి కల్లా అన్ని పనులు క్షేత్ర స్థాయిలో పనులు కన్పించేలా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రారంభించిన 2026 మార్చి నుంచి ఈ ప్రాజెక్టులన్నీ 2027 మార్చి కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో జీహెచ్ఎంసీ వ్యూహాన్ని సిద్దం చేసినట్లు సమాచారం.

నేరుగా కమిషనర్ పర్యవేక్షణ

హెచ్ సిటీ పనులను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ వ్యవస్థను గాడీన పెట్టేందుకు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ రంగంలోకి దిగినట్లు సమాచారం. గడిచిన వారం రోజుల్లో రెండు సార్లు ఈ ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించినట్లు తెల్సింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు ఎందుకు ఆలస్యమవుతుందన్న విషయంపై ఆయన తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రాజెక్టుల డిజైనింగ్ విషయంలో పూర్తి స్థాయిలో కన్సల్టెన్సీలపై ఆధారపడకుండా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ వింగ్ సొంతంగా డిజైన్లు తయారు చేయాలని కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.

పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు

అంతేగాక, సగం వరకు స్థల సేకరణ ప్రక్రియ, టెండర్ల ప్రక్రియ పూర్తయిన కేబీఆర్ పార్కు చుట్టూ కోర్టు పరిధిలోని ప్రాంతంలో పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైతే ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ కు ఇంజనీర్ ఇన్ చీఫ్ గా, జీహెచ్ఎంసీ ప్రాజెక్టుల వింగ్ కు చీఫ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి రెండు పదవుల్లో సక్రమంగా విధులు నిర్వహించటం లేదన్న విషయాన్ని గుర్తించిన ఆయన్ను కేవలం పబ్లిక్ హెల్త్ కు పరిమితం చేసి, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ వింగ్ లో సమర్థులైన ఇంజనీర్ ను ప్రాజెక్టులకు చీఫ్ ఇంజనీర్ గా నియమించాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.

 Also Read: Urea Distribution: మహబూబాబాద్ రైతు వేదిక వద్ద 980 మెట్రిక్ టన్నుల యూరియా టోకెన్ల పంపిణీ కోసం బందోబస్తు

Just In

01

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?