GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: వ్యాధుల నివారణకు జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్..?

GHMC: రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున గ్రేటర్ హైదరాబాద్ లో అంటు వ్యాధులు ప్రబలకుండా జీహెచ్ఎంసీ(GHMC) కాస్త ముందుగానే కళ్లు తెరిచింది. కొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో తరుచూ వర్షాలు కురుస్తున్నందున ప్రత్యేకంగా పారిశుద్ధ్యంపై ఇప్పటి వరకు రెండు సార్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన జీహెచ్ఎంసీ ఇపుడు అంటువ్యాధులు ప్రబలకుండా, వ్యాధులు సోకే అవకాశామున్న ప్రాంతాలను గుర్తించేందుకు శనివారం నుంచి గ్రేటర్ వ్యాప్తంగా ఫీవర్ సర్వేను నిర్వహించనుంది. ఈ ఫీవర్ సర్వేలో భాగంగా సర్కిళ్ల వారీగా విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్లు తమ సర్కిళ్ల పరిధిలో దోమల వల్ల సోకే చికున్ గున్యా, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి, అవసరమైన చోట మెడికల్ క్యాంప్ లు నిర్వహించాలని జీహెచ్ఎంసీ హెల్త్ వింగ్ సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఈ ఫీవర్ సర్వేలో భాగంగా జీహెచ్ఎంసీ అన్ని సర్కిళ్లలోని మురికివాడలు, బస్తీల్లో డోర్ టూ డోర్ వెళ్లి డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులకు సంబంధించిన అనుమానాస్పదమైన లక్షణాలున్న వారిని గుర్తించి, వారికి ముందస్తుగా వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స కోసం బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేయనున్నారు. ముఖ్యంగా సిటీలో మలేరియా ప్రభావం ఎక్కువగా లేకపోవటంతో ప్రధానంగా స్వల్ప అనారోగ్య

ఈ రెండు నెలలే కీలకం

సాధారణంగా వర్షాలు ఎక్కువ కురిసే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనే అంటువ్యాధుల నివారణపై జీహెచ్ఎంసీ(GHMC) ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది. గడిచిన మూడేళ్లలో ఈ రెండు నెలల వ్యవధిలోనే వర్షం కురిసిన తర్వాత రోడ్లపై ఏర్పడే నీటి నిల్వల్లో దోమలు వృద్ధి చెంది, వాటి కాటు కారణంగా ప్రజలు డెంగ్యూ, చికున్ గన్యా వ్యాధుల బారిన పడుతున్నట్లు గుర్తించారు. అందుకే ఫీవర్ సర్వే నిర్వహిస్తూ చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులకు సంబంధించి అనుమానాస్పద లక్షణాలున్న వారిని గుర్తించటంతో పాటు ఈ ప్రక్రియకు సమాంతరంగా ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో రోజుకి రెండుసార్లు ఫాగింగ్ నిర్వహించటంతో పాటు దోమలను గుడ్డు దశలోనే ధ్వంసం చేసేందుకు యాంటీ లార్వా ఆపరేషన్ ప్రక్రియను కూడా నిర్వహించే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే కోసం జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లతో పాటు స్వయం సహాయక బృందాల సహాయం కూడా తీసుకోవాలని ఉన్నతాధికారులు మెడికల్ ఆఫీసర్లకు సూచించినట్లు సమాచారం. ఎక్కడైనా డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులు ఖరారైతే, వ్యాధి బారిన పడిన కుటుంబం నివాసముంటున్న ఇంటి చుట్టు పక్కలనున్న యాభై ఇండ్లలోని కుటుంబాలకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, వ్యాధులు ప్రబలకుండా ఈ ఫీవర్ సర్వే నిర్వహించి, నివారణ చర్యలను ముమ్మరం చేయాలన్నారు.

Also Read: Seethakka: రెస్క్యూ కోసం హెలికాఫ్టర్లు సిద్ధం.. ఏ క్షణమైన రంగంలోకి.. మంత్రి సీతక్క

త్వరలో చెత్త విధులకు చెక్

జీహెచ్ఎంసీ పరిధిలో సర్కిళ్ల వారీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఫర్ హెల్త్ హోదాలో వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఉదయాన్నే తమ సర్కిల్ పరిధిలోని పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించటంతో పాటు వీలైనంత త్వరగా వీధులు, రోడ్లపై పేరుకుపోయిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించే పనులను పర్యవేక్షిస్తుంటారు. కానీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ శానిటేషన్ పై ఇప్పటి వరకు రెండు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించిన సందర్భంలో మెడికల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో వైద్యులు చెత్త విధులు కాకుండా ఆరోగ్య సంబంధమైన, ప్రజారోగ్య పరిరక్షణ, మెడికల్ క్యాంప్ లు, వారికి వైద్య సేవలందించే విధులు నిర్వర్తించాలని సూచించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం సర్కిల్ కు ఒకరు చొప్పున ఉన్న మెడికల్ ఆఫీసర్లలో కొందరు పిడియాట్రిక్, మరి కొందరు ఫోరెన్సిక్, నెప్రాలజీ, కార్డియాలజిస్టులతో పాటు చిల్డ్రన్స్ స్పెషలిస్టులు కూడా ఉండటంతో కమిషనర్ ఇకపై మెడికల్ ఆఫీసర్లను సర్కిల్ స్థాయిలో ప్రజారోగ్య పరిరక్షణ విధులకు పరిమితం చేయాలని భావిస్తున్నట్లు, ఇందుకు సంబంధించి త్వరలోనే కమిషనర్ కర్ణన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశామున్నట్లు సమాచారం.

నెల రోజుల్లోనే 303 డెంగ్యూ కేసులు

జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో ఒక ఆగస్టు నెలలోనే 303 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం ఇదే ఆగస్టు మాసంలో 787 కేసులు నమోదు కాగా, చికున్ గున్యా ఒక కేసు నమోదైంది. అదే అంటు వ్యాధులు ప్రబలేందుకు కీలక సమయంగా భావిస్తున్న సెప్టెంబర్ మాసం 2024లో 604, అక్టోబర్ లో 337 డెంగ్యూ కేసులు, ఇదే రెండు నెలల్లో చికున్ గున్యా కేసులు కూడా భారీగానే నమోదయ్యాయి. సెప్టెంబర్ లో 73, అక్టోబర్ లో 25 చికున్ గున్యా కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరం పొడువున మొత్తం 88 చికున్ గున్యా, ఈ సంవత్సరం ఆగస్టు చివరి కల్లా మొత్తం 664 డెంగ్యూ కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ సంఖ్య మున్ముందు పెరగకుండా ఉండేలా నియంత్రించేందుకే జీహెచ్ఎంసీ శనివారం నుంచి ఫీవర్ సర్వేను మొదలుపెట్టనున్నట్లు తెలిసింది.

Also Read: Jupalli Krishna Rao: పర్యాటక ఆతిథ్య రంగంలో కొత్త ధోరణులపై మంత్రి దృష్టి..?

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు