Cylinder Explosion: హైదరాబాద్‌లోని (Hyderabad News) సోమాజిగూడలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లో అకస్మాత్తుగా ఓ గ్యాస్ సిలిండర్ (Cylinder Explosion) పేలింది. పేలుడు ధాటికి అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వేగంగా ఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అర్పివేశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. సిలిండర్ పేలిన అపార్ట్‌మెంట్.. కత్రీయ హోటల్‌కు సమీపంలో ఉంది.
Read Also- KTR: కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలి.. నాగర్‌కర్నూల్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్ నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భారీ శబ్దంతో సిలిండర్ పేలడంతో, ఆ బిల్డింగ్‌లో నివసిస్తున్నవారు ఆందోళనతో వణికిపోయారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పేలుడు సంభవించిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించాయి. అగ్నికీలలు కీటికీల నుంచి బయటకు కనిపించాయి.
కాగా, అగ్నిమాపక సిబ్బంది తక్షణమ స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. మంటలు ఇతర అపార్ట్‌మెంట్లకు వ్యాపించకుండా అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పినట్టు అయ్యింది. కాగా, పేలుడు ఘటనకు సంబంధించిన మంటల దృశ్యాలను సెల్‌ఫోన్లతో చిత్రీకరించిన పలువురు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.
Read Also- Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్ నేతల హౌస్ అరెస్ట్.. ఓపెన్ మెరిట్ విద్యార్థుల ఆందోళనలో కొత్త మలుపు

