DCP lavanya(image credit:X)
హైదరాబాద్

DCP lavanya: మహిళలు.. మైనర్లకు వేధింపులు.. నిందితుల అరెస్ట్​!

DCP lavanya: ఇంట్లోంచి కాలు బయట పెడితే చాలు వెంటపడి వేధించే వారు కొందరైతే…సోషల్​ మీడియాలో పరిచయమై బ్లాక్​ మెయిల్​ చేసేవారు ఇంకొందరు. వీడియోలు,ఫోటోలు అడ్డం పెట్టుకుని లైంగిక వాంఛలు తీర్చుకోవాలనుకునేవారు మరికొందరు.అయితే ఇలాంటి వారికి ఏమాత్రం భయపడవద్దని ఉమెన్​ ప్రొటెక్షన్​ వింగ్​ డీసీపీ డాక్టర్ లావణ్య చెప్పారు. సమస్య వస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆ వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాళ్ల వివరాలను గోప్యంగా పెడతామని చెప్పారు.

ఫేస్​ బుక్​ లో పరిచయమై..

హైదరాబాద్​ కు చెందిన 30 సంవత్సరాల మహిళ ప్రైవేట్​ ఉద్యోగం చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి ఓయో హోటల్​ కు తీసుకెళ్లి రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. ఆ తరువాత లక్ష రూపాయలు ఇవ్వాలని, తాను పిలిచినప్పడుల్లా రావాలని, లేనిపక్షంలో నీ స్నేహితురాళ్లను పరిచయం చేయాలని బెదిరించటం మొదలు పెట్టాడు.

చెప్పినట్టు చేయకపోతే వీడియోలను సోషల్​ మీడియాలో అప్​ లోడ్​ చేస్తానని బ్లాక్​ మెయిల్ చేయసాగాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసి వెంటనే రంగంలోకి దిగిన షీ టీమ్స్​ పోలీసులు నిందితున్ని అరెస్ట్​ చేశారు. ఇదొక్కటే కాదు.. పొరుగింట్లో నివాసముంటూ వీడియోలు రికార్డు చేసి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బెదిరించిన ఓ ప్లంబర్​ ను కూడా అరెస్ట్ చేసినట్టు డీసీపీ డాక్టర్​ లావణ్య తెలిపారు.

Also read: Aghori Remand Report: అఘోరీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..

ఇక, పోలీసులనే లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మెయిల్​ చేస్తున్న ఓ మహిళను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. ఓ మహిళను చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించిన జీహెచ్​ఎంసీ డ్రైవర్ ను కూడా కటకటాల వెనక్కి పంపించినట్టు తెలియచేశారు. ఇక, ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్​ బాలికలను మోసం చేసి లైంగిక దాడులకు పాల్పడ్డ ముగ్గురిని అరెస్ట్​ చేసి ఛత్రినాక, జూబ్లీహిల్స్, మాదన్నపేట పోలీస్​ స్టేషన్లలో పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేయించినట్టు చెప్పారు.

పబ్లిక్​ ప్లేసుల్లో మహిళలు, బాలికలను వేధిస్తున్న 49మందిని ఆధారాలతో పట్టుకుని అరెస్ట్​ చేసినట్టు తెలిపారు. మహిళలు, మైనర్​ బాలికలు తమకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే 100 నెంబర్​ కు ఫోన్​ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. దాంతోపాటు షీ టీమ్స్ హెల్ప్​ లైన్​ అయిన 94906 16555 నెంబర్​ కు ఫోన్ చేయవచ్చని, వాట్సాప్ చేయవచ్చని చెప్పారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!