Aghori Remand Report: సినీ నిర్మాతను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్టయిన శ్రీనివాస్ ఎలియాస్ అఘోరీ రిమాండ్ రిపోర్టులో సంచలన వివరాలు వెలుగు చూశాయి. తన పురుషత్వాన్ని దైవానికి అంకితం చేసినట్టుగా అఘోరీ చెప్పిన మాటలు అబద్దమని పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైంది.
చిన్నతనం నుంచే అఘోరీ దొంగతనాలు చేసేవాడని తెలిసింది. ఈ క్రమంలో గ్రామస్తులు విధించిన శిక్షలో అతని మర్మావయవానికి కాలిన గాయాలై ఇన్ ఫెక్షన్ సోకినట్టు తేలింది. దాంతో తప్పనిసరై వైద్యులు ఆపరేషన్ చేసి దానిని తొలగించినట్టుగా వెల్లడైంది. మంచిర్యాల జిల్లాకు చెందిన అఘోరీ చిన్నప్పటి నుంచే తన గ్రామంలో దొంగతనాలు చేసేవాడని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
దాంతో గ్రామస్తులు ఓసారి విధించిన శిక్షలో తన పురుషత్వాన్ని కోల్పోయినట్టుగా తెలిపారు. ఆ తరువాత మహిళగా మారటానికి అఘోరీ చెన్నై వెళ్లి హార్మోన్ ట్రీట్ మెంట్ కూడా తీసుకున్నాడని పేర్కొన్నారు. ఆ సమయంలోనే తేలికగా డబ్బు సంపాదించటానికి తనను తాను అఘోరీగా ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేశాడన్నారు.
Also read: Mulugu Corruption case: ములుగు జడ్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. అధికారులు పట్టుబడిన రహస్యాలు!
వీటిని చూసే బాధితురాలు అతన్ని సంప్రదించినట్టుగా పేర్కొన్నారు. దుష్టశక్తులు వెంటాడుతున్నాయని, వాటిని తొలగించాలంటూ ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుందని బాధితురాలిని ఉజ్జయినికి తీసుకెళ్లాడని తెలిపారు. పూజల పేర 10లక్షలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ తరువాత మరో 5లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు.
డబ్బు ఇవ్వకపోతే తన తాంత్రిక శక్తులతో బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను అంతం చేస్తానని భయ పెట్టాడన్నారు. తన వద్ద తల్వార్లు, తుపాకులు ఉన్నాయని, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చంపేస్తానని బెదిరించినట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదు అందగా కేసులు నమోదు చేసి అఘోరీని ఉత్తర ప్రదేశ్ లో అరెస్ట్ చేసినట్టు తెలిపారు.