Drug Peddlers Arrested [ IMAGE CREDIT: SWETCHA REPORTER]
హైదరాబాద్

Drug Peddlers Arrested: సింథటిక్ డ్రగ్స్‌, గంజాయి పట్టివేత..పెడ్లర్ల అరెస్ట్ భారీ డ్రగ్స్‌ సీజ్

Drug Peddlers Arrested: విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఎక్సయిజ్ టాస్క్​ ఫోర్స్​ అధికారులు ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 4‌‌‌‌0లక్షల రూపాయల విలువ చేసే గంజాయి, సింథటిక్​ డ్రగ్స్​ తోపాటు ఓ కారు, బైక్​ ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన దాంట్లో అమెరికా కాలిఫోర్నియాలో పండించే ఓజీ కుష్​ (గంజాయి) కూడా ఉంది.

ఎక్సయిజ్ ఎన్​ ఫోర్స్​ మెంట్​ జాయింట్​ కమిషనర్ సయ్యద్​ యాసిన్​ ఖురేషీ ఆబ్కారీ భవన్​ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో డ్రగ్స్​ అమ్మకాలు జరుగుతున్నట్టుగా సమాచారాన్ని సేకరించిన ఎక్సయిజ్ టాస్క్​ ఫోర్స్​ బీ టీం ఎస్సై సంధ్య సిబ్బందితో కలిసి దాడి చేశారు.

Hyderabad Rain Alert: హైదరాబాద్ లో జోరు వర్షం.. మరికొద్ది గంటల్లోనే..

ప్రతీష్ భట్​, జైసూర్య అనే యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయితోపాటు 6గ్రాముల చరస్​, 4.38గ్రాముల సింథటిక్ డ్రగ్స్​, విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. స్కోడా కారుతోపాటు బైక్​ ను సీజ్ చేశారు. సమావేశంలో ఎక్సయిజ్​ టాస్క్​ ఫోర్స్​ బీ టీం సీఐ ప్రదీప్​ రావుతోపాటు సీఐ భిక్షారెడ్డి, ఎస్సైలు సంధ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?