Hyderabad Rain Alert: ప్రస్తుతం తెలంగాణలో విచిత్రమైన వాతావరణం నెలకొంటోంది. కొన్ని ఏరియాలు భానుడు భగ భగలతో అల్లాడుతుంటే మరికొన్ని ప్రాంతాలు వర్షంతో తడిచి ముద్దవుతోంది. దీంతో వర్షం పడే ప్రాంతాల్లోని ప్రజలు ఈ చల్లని వాతావరణాన్ని అస్వాదిస్తున్నారు. ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ లో వర్షం కురవనున్నట్లు పేర్కొంది.
ఆ ప్రాంతాల్లో వర్షం..
హైదరాబాద్ నగరం మరికొద్ది సేపట్లో వర్షంలో తడిచి ముద్ద కానుంది. మరో 2 గంటల్లో నగరంలో వర్షం కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. నగరంలోని పటాన్ చెరు, లింగంపల్లి, మియాపుర్, కొండాపూర్, హఫీజ్ పేట్, గచ్చిబౌలిలో వర్షం కురవనుంది. ఆ తర్వాత కూకట్ పల్లి, మాదాపూర్, జేఎన్ టీయూ, హైటెక్ సిటీ ప్రాంతాలకు ఆ వర్షం విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: Nara Lokesh about Bandi Sanjay: బండి వెనుక పడ్డ లోకేష్.. ఎందుకిలా? ఏం జరిగింది?
ఆ జిల్లాలకు అలెర్ట్
మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలకు సైతం భారత వాతారవణ విభాగం (IMD) వర్ష సూచన చేసింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలిక పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. గంటకు 40 kmph వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అటు వికారాబాద్ ఏరియాలో గంటకు 41–61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.