Telangana Excise ( IMAGE credit: setcha reporter)
హైదరాబాద్

Telangana Excise: దుమ్ము రేపుతున్న ఎక్సైజ్ పోలీసులు.. వారం రోజుల్లోనే 68.76లక్షల మద్యం సీజ్

Telangana Excise: డ్రగ్స్…నాన్​ డ్యూటీ పెయిడ్ లిక్కర్…నాటుసారాను అరికట్టటానికి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో ఎక్సయిజ్ పోలీసులు (Telangana Excise) జోరు కనబరుస్తున్నారు. వారం రోజుల్లోనే 68.16లక్షల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని సీజ్ చేశారు. గోవా, ఢిల్లీ, హర్యానా తదితర రాష్ట్రాల నుంచి కొన్ని గ్యాంగులు పెద్ద మొత్తంలో మద్యాన్ని తీసుకు వస్తూ హైదరాబాద్ లో అమ్ముతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడుతోంది. ఇక, గోవా, బెంగళూరు, ముంబయి తదితర చోట్ల నుంచి పెడ్లర్లు డ్రగ్స్ ను ఇక్కడికి తీసుకు వస్తూ విద్యార్థులు, యువకులను విక్రయిస్తున్నారు.

నాటుసారాపై స్పెషల్ డ్రైవ్

ఈ క్రమంలో మాదక ద్రవ్యాలు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసారాపై స్పెషల్ డ్రైవ్ కు ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం వారం రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా కొనసాగుతున్న దందాపై ఉక్కుపాదంతో అణచి వేయాలని సిబ్బందిని ఆదేశించారు. దీని కోసం దాడులు, తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ స్టేట్ టాస్క్ ఫోర్స్​, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ బృందాలు, ఎక్సయిజ్ పోలీసులు దాడులను ముమ్మరం చేయటంతోపాటు వ్యూహాత్మక చోట్ల తనిఖీలు చేస్తున్నారు.

వారం రోజుల్లోనే 68.16లక్షల విలువ చేసే 1704 బాటిళ్లను స్వాధీనం

ఎయిర్ పోర్టు వద్ద, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు. వారం రోజుల్లోనే 68.16లక్షల విలువ చేసే 1704 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో మహబూబాబాద్, భూపాలపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో నాటుసారా తయారీ అడ్డాలపై దాడులు చేశారు. సిబ్బంది పని తీరును అభినందించిన ఎక్సయిజ్ ఎన్​ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం స్పెషల్ డ్రైవ్ ముగిసే వరకు ఇదేవిధంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

 Also Read:Pakistan Bombing: ఒకే గ్రామంపై 8 బాంబులు జారవిడిచిన పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్… 30 మంది మృతి

బంగారం వ్యాపారులకు కుచ్చుటోపీ.. 90లక్షల సొత్తు స్వాధీనం

సహచరులతో కలిసి బంగారం వ్యాపారులకు ఓ స్వర్ణకారుడు భారీ మొత్తంలో కుచ్చుటోపీ పెట్టాడు. ఫిర్యాదు అందగా కేసులు నమోదు చేసిన నల్లకుంట పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 90లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ జీ.జగన్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ కు చెంది ప్రస్తుతం పాతబస్తీ చేలాపురా ప్రాంతంలో నివాసముంటున్న అబ్బాస్ అలీ షేక్ (46) వృత్తిరీత్యా స్వర్ణకారుడు. వెస్ట్ బెంగాల్ కే చెంది చేలాపురాలోనే ఉంటున్న రజ్జాక్ షేక్​ (23‌‌), రాంజీ షేక్ (24) కూడా ఇదే వృత్తిలో ఉన్నారు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య స్నేహం ఏర్పడింది.

 శ్రీ తుల్జా భవనీ జువెలర్స్ షాపు

ముగ్గురు కలిసి హైదరాబాద్ లోని వేర్వేరు జువెలరీ షాపు యజమానుల నుంచి పెద్ద మొత్తంలో బంగారం తీసుకుని ఆభరణాలు తయారు చేసి ఇచ్చేవారు. కాగా, కొన్నిరోజుల క్రితం అబ్బాస్ అలీ షేక్ బంగారం వర్తకుల నుంచి తీసుకున్న బంగారాన్ని కొట్టేసి లక్షలు సంపాదించాలని పథకం వేసుకున్నాడు. ఈ క్రమంలో శ్రీ తుల్జా భవనీ జువెలర్స్ షాపు యజమాని నుంచి 614.840 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నగల తయారీ కోసం తీసుకున్నాడు. శ్రీ దుర్గా భవానీ బులియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ షాపు ఓనర్​ నుంచి మరో 1292.388 గ్రాముల 22 క్యారట్ల బంగారం తీసుకున్నాడు. దాంతోపాటు మరికొన్ని నగల దుకాణాల యజమానుల నుంచి కూడా బంగారం తెచ్చుకున్నాడు.

నగల వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదులు

అయితే, నగలు తయారు చేసి ఇవ్వకుండా వ్యాపారుల నుంచి తీసుకున్న బంగారాన్ని కొంచెం కొంచెంగా అమ్ముతూ వచ్చాడు. వచ్చిన డబ్బుతో తన వద్ద పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చాడు. పెద్ద మొత్తంలో నగదును స్టోన్స్ బిజినెస్ లో పెట్టుబడులుగా పెట్టాడు. దీనికి రజ్జాక్ షేక్, రాంజీ షేక్ సహకరించారు. కాగా, బంగారం తీసుకుని రోజులు గడుస్తున్నా అబ్బాస్ అలీ షేక్ నగలు తయారు చేసి ఇవ్వక పోవటంతో నగల వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు నిందితులపై నల్లకుంట, గోషామహల్​, హుస్సేనీఆలం, చార్మినార్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నల్లకుంట స్టేషన్​ లో నమోదైన కేసుకు సంబంధించి అదనపు సీఐ ఏ.రాములు, హెడ్ కానిస్టేబుల్ ఎం.రాజు, కానిస్టేబుళ్లు శివం వినోద్ కుమార్, సాయి కిరణ్​, సందీప్ లతో కలిసి విచారణ చేపట్టారు. పక్కగా సమాచారాన్ని సేకరించి సోమవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 9‌‌0లక్షల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

 Also Read: Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు

Just In

01

Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?

OG Benefit Show: మొత్తానికి సాధించారు.. ఏపీలో బెనిఫిట్ షో టైమింగ్ మారింది!

Haris Rauf controversy: పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ భార్య షాకింగ్ పోస్టు.. వివాదానికి మరింత ఆజ్యం