Etela Rajender (imagecredit:swetcha)
హైదరాబాద్

Etela Rajender: ఆ ఘనత కేవలం మోడీకే దక్కుతుంది: ఈటల రాజేందర్

Etela Rajender: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో (MLRT) అథ్లెటిక్ ట్రాక్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ కోర్టులను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్(Etala Rajender) ప్రారంభించారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy). ఈటల రాజేందర్ అనంతరం మాట్లాడారు.

ధ్యాన్ చంద్ జయంతి

ఈరోజు ధ్యాన్ చంద్(Dhyan Chand) జయంతి. ఆయన దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ అని, హాకీకి పుట్టినిల్లు భారతదేశం హాకీని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి ధ్యాన్ చంద్, ఆయన పుట్టినరోజును భారత ప్రభుత్వం జాతీయ క్రీడల దినోత్సవం గా ప్రకటించిందని గుర్తుచేశారు. క్రీడలను ప్రోత్సహించండి, ప్రతి ఎంపీ క్రీడాకారులను కలుసుకోండి అని మాకు ఆదేశాలున్నాయి. కేంద్రం క్రీడలకు అంత ప్రాధాన్యత ఇస్తుందని ఈటెల రాజేందర్ అన్నారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉందనా అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఎంత సంపద ఉంటే ఏమిటని, కొంతమందికి తింటే అరగదు అనుభవించలేరు అని అంటూ అని అన్నారు. మన దగ్గర వెల్త్(welth) కంటే హెల్త్(Health)కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. మనవాళ్లు సృష్టించిన క్రియాశీలత సృజనాత్మకతనే మనకు ప్రేరణ అన్నారు. నరేంద్ర మోడీ(Narendra Modi)ఈ వయసులో కూడా అలసట లేకుండా ఆయన పనిచేస్తున్నారని అన్నారు. ఆయన ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.

Also Read: Sports News: ఎంఎస్ ధోనీపై భారత మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు

యువశక్తి కలిగిన దేశం
నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలలో పర్యటిస్తున్నప్పుడు పదేపదే రెండు మాటలు చెప్తూ ఉంటారు. నా భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశ జాబితాలో ఉంది. ఆయన ప్రధాని అయినప్పుడు 11వ స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు.. నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని అన్నారు. అబివృద్దిలో మొదటి స్థానంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. చైనాలో జనాభా ఎక్కువ ఉన్నా కూడా ప్రపంచంలో ఎక్కువ యువశక్తి కలిగిన దేశం కేవలం భారతదేశంమాత్రమే!.. అమెరికాలో ఉన్న గొప్ప శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, అనేక కంపెనీల సీఈవోలు భారతదేశం వారే అని గుర్తు చేశారు. ఒకప్పుడు మన జ్ఞాన సంపద విదేశాలకు తరలి వెళ్లారు. కానీ ఇప్పుడు మోడీ మన దగ్గర ఉన్న విజ్ఞానవంతులను ఇక్కడనే వినియోగించుకునేలా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా(Make In India), మేడ్ ఇన్ ఇండియా(Made In India) నినాదాలు కావు నిజం చేసి చూపిస్తున్నారని అన్నారు. అత్యధిక స్టార్టప్ లు ఉన్న దేశం మనది. ఏ దేశంలో పరిశోధనలు ఉండవో ఆ దేశంలో ఎదుగుదల ఉండదు అని నమ్మిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ఈటెల రాజేందర్ అన్నారు.

కలలు కనండి ఆ కలలు పెద్దగా కనండి
140 కోట్ల జనాభా ఉన్న దేశం.. నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా.. ఇప్పటికీ ఇల్లు లేని వారు ఉన్నారు. పేదరికంలో మగ్గేవారు ఉన్నారు. ఉపాధి లేని కుటుంబాలున్నాయి. ఈ అంతరాలు తొలగించే శక్తి విద్యార్థులుగా మీకే ఉందని అన్నారు. అబ్దుల్ కలాం ఒక సందేశం ఇచ్చారు. విద్యార్థులు కలలు కనండి ఆ కలలు పెద్దగా కనండి అని చెప్పాడు. మిసైల్ మెన్(Missile Men) గా పేరు పొందిన ఆయన ఒక మిసైల్ తయారు చేయడం కంటే.. వికలాంగులకు తక్కువ బరువున్న కాలిపర్ తయారు చేయడంలో.. అతి తక్కువ ఖర్చుతో గుండెలో స్టంట్ తయారు చేయడమే నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పారని ఆయన గుర్తు చేశారు. టెక్నాలజీ పేదలకు ఉపయోగపడాలి విధ్వంసం కోసం కాదు అని అభిప్రాయపడిన వ్యక్తి అబ్దుల్ కలాం(Abdul Kalam) విద్యార్థులుగా క్రీడల్లో పాల్గొని మంచి ఆరోగ్యవంతంగా ఉండండి. యువత విలువలతో కూడిన సాంప్రదాయాలతో కూడిన జీవన విధానం అలవాటు చేసుకోండని ఈటల రాజేందర్ అన్నారు.

Also Read: PM China Tour: ప్రధాని మోదీ చైనా పర్యటనపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?