PM China Tour (Image Source: Twitter)
జాతీయం

PM China Tour: ప్రధాని మోదీ చైనా పర్యటనపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

PM China Tour: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతీకార సుంకాలకు తెరలేపిన వేళ.. భారత్ – చైనా దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ ప్రధాని పర్యటన కీలకంగా మారనుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని చైనా పర్యటనపై కేంద్ర మంత్రి స్పందించారు. భారత్ – చైనా సంబంధాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేంద్రమంత్రి ఏమన్నారంటే?
ప్రధాని మోదీ చైనా పర్యటనపై కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ (Kirti Vardhan Singh) మాట్లాడారు. ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుందన్న ఆయన.. ఇందులో భాగంగా ప్రపంచ రాజకీయ వాతావరణం కూడా మార్పులకు లోనవుతుందని చెప్పారు. ఫలితంగా వ్యాపార, వాణిజ్య పరిస్థితులు కూడా ఎప్పుడు ఒకేలా ఉండవని.. పరిస్థితులకు అనుగుణంగా ఛేంజెస్ జరుగుతుంటాయని చెప్పారు. అంతేకాదు ప్రపంచ దేశాల మధ్య సమస్యలు ఏర్పడినప్పుడు మన ఆర్థిక వ్యవస్థకు ఉన్న బలమే దేశాన్ని ముందుకు నడిపిస్తుందని చెప్పారు. ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Also Read: Viral Video: పనసకాయలకు రంగులు వేసి.. నిగనిగలాడేలా చేసి.. కల్తీలో ఇది పీక్స్ భయ్యా!

చైనా పర్యటన ఎప్పుడంటే?
ప్రధాని మోదీ చైనా పర్యటన విషయానికి ఈ నెలఖరులో జరగనుంది. తియాంజిన్ వేదికగా ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగే షాంఘై సహకార సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. ప్రధాని మోదీ చివరిసారిగా 2018లో చైనాలో పర్యటించారు. గల్వాన్ లోయ ఉద్రిక్తల తర్వాత చైనాకు మోదీ వెళ్లడం ఇదే తొలిసారి. గల్వాన్ లోయ ఉద్రిక్తతల తర్వాత దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి గాడిలో పెట్టాలని భారత్ – చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Viral Video: హైదరాబాద్‌లో ఆ ఏరియా చూసి.. నోరు పెద్దగా తెరిచి.. రష్యన్ గర్ల్ ఏం చేసిందంటే?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం