Viral Video: ప్రస్తుత రోజుల్లో ప్రతీది కల్తీ మయంగా మారుతోంది. పాలు, పండ్లు, కూరగాయాలు, నూనె ఇలా ఏది తీసుకున్న కల్తీ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో అవి తిని చాలా మంది తమ ఒళ్లును గుల్ల చేసుకుంటున్నారు. అనారోగ్యాల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ఇలాంటిదే ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. పాడైపోయిన పనసపండ్లకు ఓ విక్రయదారుడు.. డోర్లకు వేసే పెయింట్ ను వేస్తూ కనిపించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు.
వీడియోలో ఏముందంటే?
వైరల్ అవుతున్న వీడియోను కనిపిస్తే ఓ వ్యాపారి రోడ్డు పక్కన పనస పండ్లు అమ్ముతున్నాడు. ఈ క్రమంలో చేతిలో రంగు డబ్బా, బ్రష్ పెట్టుకొని.. పాడైన పనసపండు భాగంలో పెయింట్ పూస్తున్నాడు. మరో వ్యక్తి దానిని బాగున్న పండ్లలో కలిపి వేయడం గమనించవచ్చు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన సెల్ ఫోన్ లో బంధించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ‘మనుషులు రేపు బ్రతుకుతారా లేదా అనేది పట్టించుకోరు. కానీ రేపు ఎవరో ఒకరిని మోసం చేయగలమా లేదా అనే ఆలోచన మాత్రం చేస్తారు’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.
View this post on Instagram
Also Read: Viral Video: హైదరాబాద్‌లో ఆ ఏరియా చూసి.. నోరు పెద్దగా తెరిచి.. రష్యన్ గర్ల్ ఏం చేసిందంటే?
నెటిజన్ల స్పందన
మరోవైపు పనసపండ్లకు రంగులు రాయడాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘కొద్దిపాటి డబ్బు కోసం ఇంత పాపం చేయాలా?’ అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కస్టమర్లను మోసం చేయడం నేరం.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకో యూజర్ సరదాగా ‘ఇయర్ బెస్ట్ పెయింటర్ అవార్డు ఇతడికే’ అని అన్నారు. ‘ఇదొక పెద్ద ఫ్రూట్ మాఫియా’ అని ఇంకొకరు పేర్కొన్నారు. మెుత్తంగా వీడియోను చూసిన ప్రతీ ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.