GHMC - Entomology Service( image credit: twitter)
హైదరాబాద్

GHMC – Entomology Service: దోమల నివారణ కోసం.. ఎంటమాలజీ సేవలు అమలు!

GHMC – Entomology Service: గ్రేటర్ పరిధిలో శానిటేషన్, దోమల నివారణ కోసం ఎంటమాలజీ సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు జీహెచ్ఎంసీ వన్ డే వన్ వార్డు పేరిట సరి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్దమైనట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం వన్ డే వన్ వార్డు కార్యక్రమాన్ని శానిటేషన్ విభాగంలో నిర్వహించటంతో మంచి ఫలితాలు రావటంతో ఈ కార్యక్రమాన్ని ఇతర విభాలకు కూడా విస్తరించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగానికి చెందిన ఉద్యోగులంతా తమకు కేటాయించిన ఏరియాల్లో విధులు నిర్వహిస్తూనే, ఒక రోజు పని గంటల్లో మూడు గంటల పాటు అధికారులు ఎంపిక చేసిన వార్డులో శానిటేషన్ విధులు నిర్వర్తించటంతో మంచి ఫలితాలు రావటంతో ఇపుడు ఈ కార్యక్రమాన్ని ఎంటమాలజీ విభాగంలో కూడా అమలు చేసేందుకు సిద్దమయ్యారు.

దోమల నివారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంటమాలజీ విభాగంలోని సుమారు 2 వేల పై చిలుకు ఎంటమాలజీ ఫీల్డు వర్కర్, ఎంటమాలజీ సూపర్ వైజర్, అసిస్టెంట్ ఎంటమాలజిస్టు, సీనియర్ ఎంటమాలజిస్టు కేటగిరీలకు చెందిన సిబ్బంది మొత్తం అధికారులు ఎంపిక చేసే వార్డులో విధులు నిర్వహించనున్నారు. తమ రొటీన్ విధులు నిర్వహిస్తూనే ఒక రోజు పని గంటల్లో మూడు గంటలను ఒక వార్డులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఒక విభాగానికి చెందిన వేలాది కార్మికులు మూకుమ్మడిగా ఒక వార్డులో విధులు నిర్వహించటంతో ఆ వార్డులో దోమల నివారణ ఉద్దృతమవుతుందని, ఆ వార్డులో దోమల నివారణకు సంబంధించి నెలకొన్న అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కమిషనర్ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనకు కమిషనర్ అంగీకారం తెలపగానే, వన్ డే వన్ వార్డు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఎంటమాలజీ విభాగం అధికారులు సిద్దంగా ఉన్నారు.

Also Read: GHMC Monsoon Tenders: జీహెచ్ఎంసీ టెండర్లలో గోల్‌మాల్.. కాంట్రాక్టర్లు, అధికారుల కక్కుర్తి!

ఉదయం, సాయంత్రం
వన్ డే వన్ వార్డు ఎంటమాలజీ కార్యక్రమంలో భాగంగా అధికారులు ఎంపిక చేసిన వార్డులో ఉదయం సిబ్బంది మొత్తం అన్ని ప్రాంతాల్లో దోమల వ్యాప్తిని గుడ్డు దశలోనే నివారించేందుకు యాంటీ లార్వా ఆపరేషన్ ను నిర్వహించి, సాయంత్రం అదే ప్రాంతాల్లో ఫాగింగ్ విధులు నిర్వహించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారులు ఎంపిక చేసుకునే వార్డుకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగంలోని మొత్తం మ్యాన్ పవర్ తో పాటు మిషనరీ ఒక రోజు మొత్తం ఒక వార్డులోనే విధులు నిర్వహించటం వల్ల జీహెచ్ఎంసీలోని ఆయా విభాగాల విధుల పట్ల కూడా ప్రజలకు అవగాహన కల్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రకంగా ప్రతి నెల 30 వార్డుల్లో విధులు నిర్వహిస్తూ, అయిదు నెలల్లో 150 వార్డుల్లో ఎంటమాలజీ విభాగానికి సంబంధించి వన్ డే వన్ వార్డు కార్యక్రమం ముగిసిన తర్వాత, మళ్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వార్డు నుంచి మళ్లీ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

మై జీహెచ్ఎంసీ యాప్ లో ఫిర్యాదు చేస్తే…
సిటీలోని సర్కిల్ 18 జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఆన్ లైన్ ఫాగింగ్ కార్యక్రమం మంచి ఫలితాలివ్వటంతో ఈ కార్యక్రమాన్ని కూడా అన్ని సర్కిళ్లలో నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దోమల నివారణకు సంబంధించి మై జీహెచ్ఎంసీ యాప్ ఎంటమాలజీ సర్వీస్ లో ఒక్క ఫిర్యాదు చేస్తే ఎంటమాలజీ సిబ్బంది స్పాట్ కు చేరుకుని, ఫిర్యాదుదారుడి నివాసం చుట్టే గాక, నివాసానికి వంద మీటర్ల రేడియస్ దోమల నివారణ కోసం ఫాగింగ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఈ ప్రయోగం సక్సెస్ కావటంతో సిటీలోని అన్ని సర్కిళ్లలో అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Also Read: Swetcha Special story: చదువే జీవన గమనాన్ని మార్చుతుంది.. ఎస్పీ పై స్వేచ్ఛ ప్రత్యేక కథనం!

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!