Hydraa: రాష్ట్ర ప్రభుత్వం చెరువులు కుంటలు కబ్జా కాకుండా హైడ్రా(Hydraa) లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. వీటితో తమకేమీ పట్టనట్టుగా అక్రమార్కులు తమ పని తము చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్రమార్కులకు అధికారుల అండదండలు ఉండడంతో మరింత రెచ్చిపోతున్నారు. ఈ ఆక్రమణల వల్ల రానున్న రోజుల్లో మేడ్చల్(Medcal) పెద్ద చెరువుతో ప్రజలకు ముప్పు పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు.
పర్యాటకంగా అలరిస్తున్న మేడ్చల్ పెద్ద చెరువు
మేడ్చల్(Medchal) చెరువు వర్షాకాలంలో అలుగు పారుతున్నప్పుడు చెరువు ప్రాంతం ప్రజలతో ఒక పర్యాటక ప్రాంతంగా సందడిగా మారుతుంది. అంతేకాకుండా మేడ్చల్ పట్టణ ప్రజలు బతుకమ్మ(Bathukamma)తో పాటు గణేష్ లను అదే చెరువులో నిమజ్జనం చేస్తారు. మత్స్య కారులు సైతం మేడ్చల్ చెరువులో చేపలు పెంచుతూ జీవనోపాదిని కొనసాగిస్తున్నారు. ఎంతో మందికి ఆసరాగా ఉంటున్న మేడ్చల్ పెద్ద చెరువును కొందరు అక్రమార్కులు కబ్జా చేసి చెరువును కనుమరుగు అయ్యేలా చేస్తున్నారు.
Also Read: Jupally Krishnarao: హరీశ్ రావు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బెటర్
కబ్జాతో పొంచి ఉన్న ముప్పు
మేడ్చల్ పెద్ద చెరువు కొందరు అక్రమార్కులు అలుగు వద్ద ఉన్న స్థలాన్ని నీరు బయటికి పోకుండా మట్టితో పూడుస్తూ కబ్జాకు యత్నిస్తున్నారు. అలుగు వద్ద మట్టి పోసి స్థలాన్ని కబ్జా చేయడం వల్ల చెరువు నిండినపుడు అలుగు నుంచి నీరు బయటకు పోక పోవడంతో అనేక ఆవాసాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. చెరువు అలుగు కబ్జాతో పంట పొలాలు, పారిశ్రామిక కంపెనీలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సైతం పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టింపులేని అధికారులు
మేడ్చల్ పెద్ద చెరువు(Medchal big pond) కబ్జాకు గురవుతున్నా రెవిన్యూ, ఇరిగేషన్ అధికారుల(Irrigation officials)కు కనబడటం లేదా అని మేడ్చల్ పట్టణ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితమై బయట జరుగుతున్న అక్రమాలను అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మేడ్చల్ తహశీల్దార్ కార్యాలయానికి కొద్ది దూరంలోనే ఉన్న పెద్ద చెరువుకే రక్షణ లేకపోతే? ఇక మారుమూల గ్రామాల్లో ఉన్న చెరువుల పరిస్థితి ఏంటని? స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కబ్జాపై హైడ్రా కు ఫిర్యాదు చేయనట్లు స్థానికులు చెబుతున్నారు.
కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: వి. భూపాల్
మేడ్చల్ పెద్ద చెరువు కబ్జా విషయం నా దృష్టికి రాలేదు. రెవెన్యూ అధికారులను పంపించి చర్యలు తీసుకుంటామని, చెరువులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలకు పాల్పడితే ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని అన్నారు.
Also Read: Shadnagar Road Accident: షాద్ నగర్ లోఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి కూతురు స్పాట్ డెడ్!
