Jubilee Hills By Election: త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు దేశంలో మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికకు భారత ఎన్నికలసంఘం సరి కొత్త మారదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election)లో అమలు చేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారిగా అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థి కలర్ ఫొటో(Color photo)ను ఈవీఎంలోని బ్యాలెట్ లో డిస్ ప్లే చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnana) వెల్లడించారు.
ప్రతి నాలుగు బ్యాలెట్ యూనిట్లకు ఒక వీవీ ప్యాట్ ను వినియోగించేలా బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ లను లింక్ చేసే ప్రాసెస్ ఇప్పటికే మొదలైనట్లు ఆయన వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల విత్ డ్రా గడువు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం జారీ చేసిన సరి కొత్త నిబంధనలను వివరించారు.
ఓటరకు సౌకర్యవంతంగా..
గతంలో జరిగిన పలు ఎన్నికల్లో అమలు చేసిన నిబంధనల ప్రకారం పోలింగ్ స్టేషన్ లోకి సెల్ ఫోన్ ను అనుమతించలేదు. కానీ ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇపుడు ఓటు వేసేందుకు వెళ్లే ఓటర్లు హ్యాప్పీగా తమ సెల్ ఫోన్ తీసుకుని పోలింగ్ స్టేషన్(Polimimg Station) కు వెళ్లవచ్చు. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత సెల్ ఫోన్ ను మీరు ఓటు వేయనున్న పోలింగ్ స్టేషన్ లోకి ఫోన్ అనుమతించుకుండా పోలింగ్ స్టేషన్ బయట ఏర్పాటు చేయనున్న సెల్ ఫోన్ కౌంటర్ లో మీ సెల్ ఫోన్ డిపాజిట్ చేసి, మీరు ఓటు వేసేందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఓటు వేసిన తర్వాత కౌంటర్ నుంచి మీ సెల్ ఫోన్ మీరు తిరిగి చేసుకునే ఏర్పాట్లను చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏకంగా 58 అభ్యర్థులు బరిలో నిలిచినందున, నాలుగు బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తున్నందున ఓటింగ్ కంపార్ట్ మెంట్ ఓటరకు సౌకర్యవంతంగా ఉండేలా, సైజును పెంచి ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ నిబంధనలతో పాటు ఇదివరకే జారీ చేసిన ఓటింగ్ శాతం పెంపు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో స్వీప్ కార్యక్రమాలను ముమ్మరం చేయటంతో పాటు 80 ప్లస్ ఓటర్లు కోరితే ఇంట్లోనే ఓటు వేసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులో తెస్తామని ఆయన వివరించారు. అంతేగాక ఓటరు తమ ఓటు హక్కు ఏ పోలింగ్ స్టేషన్ లో ఉంది? ఓటరు జాబితాలో సదరు ఓటరు వరుస సంఖ్యను సూచించేలా ఈ సారి పంపిణీ చేయనున్న ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ లో కుడి వైపు ఓటరు పోలింగ్ స్టేషన్ నెంబర్ తో పాటు వరుస(Karnan) వెల్లడించారు.
27న జూబ్లీహిల్స్ కు 8 పారా మిలిటరీ..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లుండగా, వీటిలో 65 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నందున పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా ముందు జాగ్రత్తగా ఈ నెల 27న ఎనిమిది పారా మిలిటరీ దళాల కంపెనీలను రప్పించనున్నట్లు నగర పోలీసు జాయింట్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించారు. ఈ మొత్తం పారా మిలిటరీ కంపెనీలను క్రిటికల్ పోలింగ్ స్టేషన్లున్న ప్రాంతాల్లో మోహరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉప ఎన్ని షెడ్యూల్ జారీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.2 కోట్ల 82 లక్షల 32 వేల 83 నగదును అక్రమంగా తరలిస్తుండగా, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దీనికి తోడు సుమారు రూ .3 లక్షల 69 వేల 478 విలువైన సుమరు 512 లీటర్ల మద్యాన్ని, రూ. లక్షా 41 వేల విలువైన 0.197 కేజీల గంజాయిని, 0.011 గ్రాముల ఎండీఎంఏ ను స్వాధీనం చేసుకున్నట్లు, వీటితో పాటు మరో 11 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు ఇక్బాల్ శుక్రవారం జీహెచ్ఎంసీలో జరిగిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ ఎన్నికకు సుమారు 2400 మంది పోలీసులు బందోబస్తును నిర్వహించనున్నట్లు, కోడ్ ను మరింత పక్కాగా అమలు చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లు 45, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ లు 45, వీడియో సర్వైలెన్స్ టీమ్ లు 4, వీడియో వ్యూహింగ్ టీమ్ లు 2, అకౌంటింగ్ టీమ్ లు మరో రెండు రౌండ్ ది క్లాక్ విధి నిర్వహణలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
Also Read: The Raja Saab: బర్త్ డే స్పెషల్.. పాటన్నారు, కేవలం పోస్టర్ మాత్రమేనా!
