Local Body MLC Elections
హైదరాబాద్

Local Body MLC Elections: హైదరాబాద్ లో ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన.. ఏప్రిల్ 23న పోలింగ్

Local Body MLC Elections: హైదరాబాద్ లో మరోమారు ఎన్నికల నగరా మోగింది. స్థానిక సంస్థల్లో ఒక ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 28న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ఈసీ ప్రకటించింది. ఏప్రిల్ 4న నామినేషన్ కు చివరితేదీగా నిర్ణయించినట్లు తెలిపింది. అలాగే ఏప్రిల్ 9 వరకూ నామినేషన్ ఉపసంహరణకు అనుమతించింది. ఏప్రిల్ 23న పోలింగ్ ఉంటుందని రెండ్రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. మే 1తో ఎమ్మెల్సీ ప్రభాకర్‌ (MLC Prabhakar) పదవీకాలం ముగియనుండటంతో ఈసీ (EC) ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేసింది. కాగా, ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి ఐదు స్థానాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసింది. ఇందులో అధికార పార్టీకి సంబంధించి నలుగురు, విపక్ష బీఆర్ఎస్ కు సంబంధించి ఒకరు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవమయ్యారు.

Also Read: Good News to Muslims: ముస్లింలకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం..

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!