Jubilee Hills By Election (imagecredit:twitter)
హైదరాబాద్

Jubilee Hills By Election: నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Jubilee Hills By Election: భారత ఎన్నికల కమిషన్‌ జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికను నవంబర్‌ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(MLA Maganti Gopinath) ఖాళీ చేసిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్షన్‌ రెడ్డి(C. Sudharshan Reddy) తెలిపారు.ఉప ఎన్నికకు సంబంధించిన గిట్‌ నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 13న వెలువడుతుంది. నామినేషన్ల దాఖలు చివరి తేదీ అక్టోబర్‌ 21, పరిశీలన అక్టోబర్‌ 22, వెనక్కి తీసుకునే గడువు అక్టోబర్‌ 24గా నిర్ణయించారు. ఓటింగ్‌ నవంబర్‌ 11న, లెక్కింపు నవంబర్‌ 14న జరుగుతుంది. మొత్తం ఎన్నిక ప్రక్రియ నవంబర్‌ 16, 2025 నాటికి పూర్తవుతుందని తెలిపారు.

మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌..

ఇక ఉప ఎన్నికలో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఇలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు(Voting machines), వీవీ ప్యాట్‌(VV Pyat) యంత్రాలను వినియోగించనున్నారు. అవసరమైన యంత్రాలు ఇప్పటికే పరీక్షించి సిద్ధం చేశామని, పోలింగ్‌ సాఫీగా జరగేందుకు అన్ని సాంకేతిక, భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు.ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డు తో పాటు ఆధార్‌(Aadhaar), డ్రైవింగ్‌ లైసెన్స్‌(Driving License), పాస్‌పోర్ట్‌(Passport), ప్యాన్‌ కార్డు(pancard), పెన్షన్‌ పత్రం వంటి గుర్తింపు పత్రాలతో ఓటు వేయవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు.

Also Read; Huma Qureshi: కుక్కలు చింపిన విస్తరిలా ఉంది.. ఈ టీషర్ట్ రూ.65 వేలట.. నటిని ఏకిపారేస్తున్న నెటిజన్లు!

మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా..

హైదరాబాద్‌ జిల్లాలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ తక్షణమే అమల్లోకి వచ్చింది. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తమకు ఉన్న క్రిమినల్‌ నేపథ్య వివరాలను పత్రికలు, టీవీ, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రకటించడం తప్పనిసరి అని కమిషన్‌ స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను పూర్తిగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉన్నదని సీఈవో సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆయన ఓటర్లను తమ పేర్లు ఓటరు జాబితాలో ధృవీకరించుకుని, ఎన్నికల్లో సక్రియంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Also Read; BC Reservations: కాంగ్రెస్‌కు బిగ్ రిలీఫ్.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?