BC Reservations (Image Source: Twitter)
తెలంగాణ

BC Reservations: కాంగ్రెస్‌కు బిగ్ రిలీఫ్.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

BC Reservations: బీసీ రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం 42 శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టులో రెండు పిటిషన్లు పెండింగ్ లో ఉండగా.. సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని పిటిషనర్ వంగా గోపాల్ రెడ్డిని ప్రశ్నించింది. అయితే హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతోనే ఇక్కడికి వచ్చామని పిటిషనర్ చెప్పగా.. కింది కోర్టులో పెండింగ్ ఉన్నందున విచారణకు స్వీకరించలేమని సుప్రీం తేల్చిచెప్పింది.

‘హైకోర్టు స్టే ఇవ్వకపోతే.. వచ్చేస్తారా?’

బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ – 9 సవాలు చేస్తూ వంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్దార్ధదవే, అభిషేక్ సింఘ్వీ, ఎడీఎన్ రావు వాదనలు వినిపించారు. తెలంగాణ హైకోర్టులో ఇదే అంశంపై రెండు పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయని వాదించారు. ఈ క్రమంలో ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్ ను ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వలేదని అందుకే వచ్చామని పిటిషనర్ తరపు లాయర్ చెప్పగా.. స్టే ఇవ్వకపోతే వచ్చేస్తారా? అంటూ ప్రశ్నించింది. అనంతరం పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించినట్లైంది.

సుప్రీం తీర్పు శుభ పరిణామం: టీపీసీసీ చీఫ్

బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. దీనిని ఒక శుభపరిణామంగా అభివర్ణించారు. ’42 శాతం బిసి రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేస్తోంది. ఇప్పటికే 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్, ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసింది. 8న హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చేవారు ప్రభుత్వానికి అండగా నిలవాలి’ అని టీపీసీసీ చీఫ్ అన్నారు.

Also Read: Supreme Court: సుప్రీంకోర్టులో షాకింగ్ ఘటన.. సీజేఐ గవాయ్‌పైకి బూటు విసరబోయిన లాయర్

‘నోటి దగ్గర కూడు లాక్కోకండి’

మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ సైతం ఈ అంశంపై మాట్లాడారు. ‘సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. బీసీ బిడ్డలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇస్తే కొందరు తట్టుకోలేకపోతున్నారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ చిత్తశుద్దిగా ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ లు చేస్తున్న కుట్రలను బీసీలు అర్ధం చేసుకోవాలి. బీసీ బిడ్డల నోటి దగ్గర ముద్దను లాక్కొక్కండి. బీఆర్ఎస్ నేతలు కుల సంఘ నాయకుని ముద్ర వేసుకుని కోర్టుకు వెళ్తున్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపును అడ్డుకునే ఉత్సాహాన్ని బీసీలు గమనిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

Also Read: West Bengal-Bhutan: డేంజర్‌లో బెంగాల్.. ప్రమాదకరంగా భూటాన్ డ్యామ్.. ఏ క్షణమైనా నీరు ముంచెత్తే ఛాన్స్!

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?