Ekashila Plot Owners: పోచారం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా (Hydra) దూకుడు పెంచింది. ఇటీవల దివ్యానగర్ లో భారీ ప్రహరీ గోడ నిర్మాణం కూల్చివేసింది. కాగా ఉదయం కొర్రెముల ఏకశిలా నగర్ (Ekashila Nagar) లో సర్వే నెంబర్ 740, 741, 742 లో 7.16 ఎకరాల భూమి చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చి వేశారు. ఏకశిలా వెంచర్ లో తప్పుడు పత్రాలు సృష్టించి వ్యవసాయ భూములుగా రెవెన్యూ రికార్డులలో నమోదు చేయించారని, తమకు న్యాయం చేయాలంటూ ఏకశిల ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఇటీవల హైడ్రా కమిషనర్ (Hydra Commissioner)ను కలిసి కోరారు.
Also Read: Hormuz Closure Impact: సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు.. కారణాలివే!
7.16 ఎకరాల అర్బన్ సీలింగ్ ల్యాండ్
ఈ మేరకు హైడ్రా (Hydra) బృందం ఏకశిల వెంచర్ లో 7 ఎకరాల చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు. దీంతో ఏకశిలా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే హైడ్రాధికారులు ఎలాంటి రికార్డులు పరిశీలించకుండానే తమ వ్యవసాయ భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చివేశారని భూ యజమాని నూనె వెంకటనారాయణ పేర్కొంటున్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. 740, 741, 742 సర్వే నంబర్ల లో 7.16 ఎకరాల అర్బన్ సీలింగ్ ల్యాండ్ ను ప్రభుత్వం ద్వారా పట్టేదారులు రెగ్యులరైజ్ చేసుకున్నారని, ఆ భూమికి సంబంధించిన అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేశామని చెప్పారు.
Also Read: BJP MP Kishan Reddy: బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రం వెనుకబడింది.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్!