BJP MP Kishan Reddy( IMAGE credit: twiitter)
Politics

BJP MP Kishan Reddy: బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రం వెనుకబడింది.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్!

BJP MP Kishan Reddy: ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ చివరకు ఒక కుటుంబానికి బలైపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు చేశారు. ప్రధాని మోదీ 11 ఏండ్ల పాలనతో పాటు ఎంపీగా ఈటల ఏడాది పాలనను పురస్కరించుకుని మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో  వికసిత్ భారత్ సంకల్ప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి (Kishan Reddy) హాజరై మాట్లాడారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ (KCR) కుటుంబం అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. ఒక నియంత పాలనతో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. ప్రజలు విసుగు చెంది మార్పు కోరుకుని (KCR) కేసీఆర్‌ను గద్దె దించారని విమర్శించారు.

 Also Read: Bandi Sanjay: కేసీఆర్ కుటుంబానికి సర్కార్ రక్షణ.. బండి సంజయ్ సంచలన కామెంట్స్!

కానీ, రాహుల్, (Rahul) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇచ్చిన హామీలు చూసి ప్రజలు (Congress) కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని, అధికారం చేపట్టాక ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని స్వయంగా ముఖ్యమంత్రి అంటున్నారని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వంలో ఏ వార్త చూసినా కుంభకోణాలు, అవినీతిపై వార్తలు వచ్చేవని, అందుకే 2014లో (Modi) మోదీని ప్రధాని చేశారన్నారు.

గతంలో పాకిస్థాన్ ఆడిందే ఆటగా ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా దేశాన్ని అంతలాకుతలం చేశారని, కానీ మోదీ ప్రధాని అయ్యాక ఉగ్రవాద చర్యలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరాలంటే (BJP) బీజేపీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారాన్ని అందించాలని కోరారు. ఈటల రాజేందర్ (Etala Rajender) ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తున్నారని కిషన్ రెడ్డి (Kishan Reddy) కొనియాడారు.

 Also Read: Sridhar Rao Audio Leak: కలకలం రేపుతున్న.. సంధ్య శ్రీధర్ ఆడియో!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!