Bandi Sanjay: కేసీఆర్ కుటుంబానికి సర్కార్ రక్షణ.. బండి సంజయ్
Bandi Sanjay( IMAGE CREDIT: SWETCHA REPORTER)
Political News

Bandi Sanjay: కేసీఆర్ కుటుంబానికి సర్కార్ రక్షణ.. బండి సంజయ్ సంచలన కామెంట్స్!

Bandi Sanjay: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రక్షణ కవచంగా మారారని, అందుకే  (KCR) కేసీఆర్‌పై ఎన్ని అవినీతి ఆరోపణలున్నా, కేసులు పెట్టినా ఆయనను మాత్రం అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. “ప్రజలకు కాంగ్రెస్, (Congress) (BRS) బీఆర్‌ఎస్‌ల కుమ్మక్కు రాజకీయాలు అర్థమయ్యాయి. అందుకే అందరికీ అవకాశం ఇచ్చామని, ఒక్కసారి బీజేపీకి అధికారం ఇద్దామనే నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్, (Congress) బీఆర్‌ఎస్ ) (BRS) పార్టీలు వేర్వేరు కానేకాదు, సంయుక్తంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి” అని బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు.

 Also Read: Liquor Seized: అక్రమ మద్యం రవాణా 92 బాటిళ్లు సీజ్!

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) విషయంలో బీజేపీపై విష ప్రచారం జరుగుతుందని సంజయ్ మండిపడ్డారు. “కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కేసీఆర్ (KCR)  కుటుంబానికి ఏటీఎంగా మారిందని సాక్షాత్తు ప్రధాని మోదీయే వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు అమిత్ షా, (Amit Shah) జేపీ నడ్డా కూడా చెప్పారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలన్నదే బీజేపీ (BJP)విధానం. అంతేతప్ప ఊసరవెల్లి మాదిరిగా విధానాలు మార్చుకునే పార్టీ బీజేపీ కాదు” అని సంజయ్ (Bandi Sanjay) స్పష్టం చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వం (Congress  Government) కేసీఆర్ (KCR)  కుటుంబాన్ని వదిలేసి కొందరు అధికారులనే బలి చేయాలనుకోవడం దుర్మార్గం.

కేసీఆర్ (KCR)  అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?” అని బండి సంజయ్ ప్రశ్నించారు. (Karimnagar) కరీంనగర్‌లో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనని, ముఖ్యంగా జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలకు సంబంధించిన ఫైలు విషయంపై కలెక్టర్‌తో మాట్లాడినట్లు బండి వివరించారు. సంబంధిత శాఖ మంత్రి  (Uttam Kumar Reddy)ఉత్తమ్ కుమార్ రెడ్డితోనూ మాట్లాడి తప్పకుండా స్థలాలిచ్చేలా కృషి చేస్తానని బండి హామీ ఇచ్చారు.

 Also ReadSridhar Rao Audio Leak: కలకలం రేపుతున్న.. సంధ్య శ్రీధర్ ఆడియో!

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం