Metro Fest 2025: దసరాను పురస్కరించుకొని ఈ ఏడాది కూడా ‘మెట్రో ఫెస్ట్’ పేరుతో హైదరాబాద్ మెట్రో ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. మెట్రో ప్రయాణికులు, నగర పౌరులకు వినోదం, ఆహారం, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రదర్శనలతో కూడిన వేడుకలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో సెప్టెంబర్ 24 నుంచే దసరా మెట్రో ఫెస్ట్ 2025 వేడుకలు మెుదలైపోయాయి.
సెప్టెంబర్ 24
హైదరాబాద్ మెట్రో ఫెస్ట్ (Hyderabad Metro Fest 2025) తొలి రోజులో భాగంగా అమీర్ పేట్ స్టేషన్ లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా దీప ప్రజ్వలనతో సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. క్లాసికల్ డ్యాన్స్, మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రదర్శనకు ఉంచారు. అలాగే సాంప్రదాయక దసరా స్వీట్స్, స్నాక్స్, ఫ్యూజన్ ఫుడ్ ను అందుబాటులో ఉంచారు. కొన్ని స్టాల్స్ లో ఆహారాన్ని టెస్ట్ చేసేందుకు ఫ్రీగానే ఇవ్వడం విశేషం.
సెప్టెంబర్ 25
సెప్టెంబర్ 25న లైవ్ మ్యూజిక్, డీజే సెషన్స్ ఏర్పాటు చేశారు. అలాగే గేమ్ జోన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. రింగ్ టాస్, షూటింగ్ గేమ్స్, లక్కీ డ్రా వంటివి మెట్రో ప్రయాణికులను ఆకట్టుకున్నాయి. అలాగే ఫోక్ డ్యాన్స్, హ్యాండ్ లూమ్, హ్యాండ్ క్రాఫ్ట్స్, గిఫ్ట్ ఐటెమ్స్ కూడా మెట్రో స్టేషన్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
సెప్టెంబర్ 26
చివరి రోజైన ఇవాళ (సెప్టెంబర్ 26) దసరా కళ ఉట్టిపడేలా స్పెషల్ థీమ్ షోలు ఏర్పాటు చేశారు. రామాయణ కథలు, పుప్పెట్ షోలు, వివిధ రకాల ఆహారాలు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ఫొటో జోన్స్, మెట్రో ప్రయాణికులకు ప్రత్యేక డిస్కౌంట్స్, గిఫ్టులు ఏర్పాటు చేశారు. మెట్రో ఫెస్ట్ కారణంగా అమీర్ పేట్ స్టేషన్ పండుగ వాతావరణాన్ని తలిపిస్తోంది.
✨ Festive vibes at the Dussehra Metro Fest 🚉🪔
Meet Chekoti Keerthi Reddy from Chekoti Bio Organic Products LLP, bringing Ayurveda to life with skincare, haircare & wellness foods. 🌿👉 Visit the stalls, explore organic wellness, and experience the festive buzz at… pic.twitter.com/knJBugjrKX
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 26, 2025
Also Read: Asteroid Collision 2025: ముంచుకొస్తున్న ముప్పు.. ఏ క్షణమైన భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలం..!
మెట్రో సమాచారం
హైదరాబాద్ మెట్రో రోజువారీ సమయాలను ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 11:00 గంటలుగా నిర్ణయించారు. టికెట్ ధరలు సాధారణంగా రూ.10 – రూ.60 మధ్య ఉంటాయి. ప్రయాణికులు, మెట్రో స్టేషన్ల భద్రతకు ఎల్ అండ్ టీ సంస్థ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. మెట్రో సిబ్బంది నిరంతరం పహారా కాస్తుంటారు.