Water Board: నగరంలోని దుర్గం చెరువు సమీపంలోని కావూరి హిల్స్ లో మురుగు నీటి సమస్యకు జలమండలి పర్మినెంట్ గా చెక్ పెట్టనుంది. ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనుంది. వర్షం పడినప్పుడు ఇక్కడ సీవరేజీ ఓవర్ ఫ్లో వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి(Water Board MD Ashok Reddy), ఇతర శాఖల అధికారులతో ఆ ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించి సమస్యకు శాశ్వత పరిష్కరం కోసం జలమండలి, ఇతర శాఖల అధికారులతో చర్చించారు. వరుస వర్షాల కారణంగా చెరువులోని నీటి మట్టం పూర్తి ట్యాంక్ లెవల్ కు చేరుకోవడంతో డ్రైనేజ్ ఓవర్‌ఫ్లో సమస్య ఏర్పడుతున్నట్టు అధికారులు ఎండీకి చెప్పారు. వర్షాల కారణంగా ఏర్పడిన డ్రైనేజీ ఓవర్‌ఫ్లోను అయన పరిశీలించారు. వెంటనే సీవరేజ్ లైన్ లను డీ-సిల్టింగ్ చేసి మురుగుకు అడ్డకట్టు వేయాలని అధికారులకు సూచించారు.
మురుగు చేరకుండా చర్యలు
అలాగే ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తగిన విధంగా శాశ్వత పరిష్కరానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎండీ అధికారులను ఆదేశించారు. మరోవైపు సమస్య పరిష్కారానికి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమీపంలోని భవనాల నుంచి వచ్చే సీవరేజీకి దుర్గం చెరువు ఎస్టీపీ(SDP) ఐఎండీ(IMD) వద్ద అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వర్షపు నీటి కాల్వలో మురుగు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాంటి పాయింట్లను గుర్తించి వర్షపు నీటి కాల్వ నుంచి సీవరేజ్ లైన్ ను వేరు చేసి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎండీ సూచించారు. దుర్గం చెరువు అవుట్ లెట్ వద్ద ఉన్న స్లూయిస్ వాల్వ్ లను ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
Also Read: China-India: ట్రంప్ టారిఫ్ విషయంలో భారత్‌కు మద్దతు ప్రకటించిన చైనా
దుర్గం చెరువు ఎస్టీపీ పరిశీలన
కోద్ది నెలల క్రితం ప్రారంభమైన దుర్గం చెరువు వద్దనున్న జలమండలి 7 ఎంఎల్డీల సామర్ధ్యం గల మురుగునీటి శుద్ది కేంద్రాన్ని (ఎస్ టీపీ)ని ఎండీ అశోక్ రెడ్డి సందర్శించారు. మురుగునీరు శుద్ది ప్రక్రియను ఎండీ పరిశీలించారు. ఎస్టీపీల్లో ఇన్ లెట్, అవుట్ లెట్ ను పరిశీలించిన ఎండీ అనంతరం ఎస్టీపీ పర్యవేక్షణ ను ఆన్ లైన్(Onine) లో చేపట్టేందుకు ఏర్పాటు చేసిన స్కాడా రూమ్ ని సందర్శించి, పనితీరు పరిశీలించి, ఆన్ లైన్ లో అందుబాటులో ఉండే వివరాలను అడిగి తెలుసుకున్నారు. జలమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని ఎస్టీపీల పనితీరు, వస్తున్న ఇన్ ఫ్లో, శుద్ధి చేసిన నీటి నాణ్యత వివరాలు ఎప్పటికప్పుడు తెలిసేలా ప్రధాన కార్యాలయంలో డాష్ బోర్డు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీపీల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచి, అవకాశం ఉన్న చోట మొక్కలను పెంచి ఎస్టీపీ సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్శనలో జలమండలి సీజీఎమ్ లు పద్మజ, నారాయణ, జీఎంతో పాటు జలమండలి, జీహెచ్ఎంసీ లేక్ డివిజన్ అధికారులు పాల్గొన్నారు.
Also Read: Viral Video: రూ.1.8 కోట్ల జీతంతో ఉద్యోగం.. తీరా రోడ్ల వెంట ఐస్‌క్రీమ్ అమ్ముకుంటున్న ఉద్యోగి!