Hydraa: చెరువు నీటిని ల్యాబ్ టెస్టింగ్ పంపిన హైడ్రా అధికారులు
Hydraa (imagecredit:swetcha)
హైదరాబాద్

Hydraa: చెరువు నీటిని ల్యాబ్ టెస్టింగ్ పంపిన హైడ్రా అధికారులు.. ఎందుకో తెలుసా..!

Hydraa: మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని సుతారిగూడ చెరువును హైడ్రా(Hydraa) అధికారులు పరిశీలించారు. చెరువుల నీటి పరిస్థితిని పరిశీలించేందుకు నీటి శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ టెస్టింగ్ కు పంపించారు.

అసలు ఏం జరుగుతుంది

గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని సుతారి కూడా చెరువు ఎప్పుడు చూసినా నిండుకుండలా కనిపిస్తుంది. ఇందుకు కారణం సుతారిగూడ పరిసర ప్రాంతంలో ఉన్న సీఎంఆర్ కళాశాల(CMR College), సీఎంఆర్ కళాశాలకు సంబంధించిన హాస్టల్ తోపాటు కండ్ల కోయ గ్రామానికి చెందిన డ్రైనేజ్ వీటిని సుతారి గూడ చెరువులోకి వదులుతున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున డ్రైనేజీ నీరు వచ్చి సుతారి గూడ చెరువులోకి చేరుతుంది. దీంతో సుతారిగూడ చెరువు నిరంతరం మురికి నీటితో చెరువు ఎప్పుడు నిండుకుండలా కనిపిస్తుంది. అంతేకాకుండా చెరువు ఎప్పుడూ మురికి నీటితో నిండి ఉండడం వల్ల సమీప పట్టా భూమిలో ఉన్న పంట పొలాలు నిరంతరం ఈ చెరువులో ముంపునకు గురవుతున్నాయి. దీంతో స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేసిన ఫలితం లేకపోవడంతో హైడ్రా అధికారులను సంప్రదించారు. దీంతో హైడ్రా ఇరిగేషన్ శాఖ డీఈ అర్చన, హైడ్రా పొల్యూషన్ శాఖ అధికారిని శ్రీవల్లి సుతారిగూడ చెరువును పరిశీలించారు. చెరువు నీటి పరిస్థితి పరిశీలించేందుకు నీటి శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ టెస్టింగ్ కు పంపించారు. ఈ కార్యక్రమంలో గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సహకార బోయిన మల్లేష్ ముదిరాజ్, సహకార సంఘం బ్యాంక్ చైర్మన్ రణదీప్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు చింతల హరిబాబు,, చింతల భాస్కర్ ముదిరాజ్ తలారి వెంకట ముదిరాజ్ లక్ష్మీనారాయణ, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Dharmpuri Sanjay: మున్నూరు కాపు సంఘ ప్రమాణ స్వీకారోత్సవం జయప్రదం చేయండి : జిల్లా అధ్యక్షుడు డి సంజయ్

అమ్మయ్య సమస్యకు పరిష్కారం దొరికింది

గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని సుతారిగూడ చెరువు సమస్యకు పరిష్కారం లభ్యమైందని ఆ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుతారిగూడ చెరువులో సీఎంఆర్ కళాశాలతో పాటు ఆ కళాశాల చెందిన హాస్టల్ తో పాటు కండ్లకోయ గ్రామం నుండి డ్రైనేజీ నీరు సుతారిగూడ చెరువులోకి వచ్చి చేరుతుందని, దీనివల్ల చెరువులో దోమలు ఈగలు వ్యాప్తి చెందడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, చెరువులో కలిసే డ్రైనేజీ నీటిని చెరువులో కలవకుండా చూడాలంటూ పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసిన ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా నిరంతరం సుత్తారి గూడ చెరువు డ్రైనేజీ నీటితో నిండుకుండలా ఉంటూ సమీప పొలాలు ముంపునకు గురి కావడంతో చివరకు హైడ్రా అధికారులను సంప్రదించారు.

ల్యాబ్ టెస్టింగ్

హైడ్రా అధికారులు సుతారిగూడ చెరువును సందర్శించి చెరువు లోని నీటి పరిస్థితిని పరిశీలించేందుకు పరిశీలించేందుకు నీటి శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ టెస్టింగ్ పంపించారు. ఈ టెస్టింగ్ ద్వారా సుతారీ గూడ చెరువులో నిజంగానే డ్రైనేజ్ వాటర్ కలుస్తుందన్న ల్యాబ్ టెస్టింగ్ లో నిర్ధారణ అయితే సీఎంఆర్ కళాశాలతో పాటు హాస్టల్ తోపాటు కండ్లకోయ గ్రామం నుండి డ్రైనేజ్ నీటిని సుతారి గూడ చెరువులోకి డ్రైనేజ్ వీటిని కలవకుండా కలవకుండా హైడ్రో అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో సుతారిగూడ ప్రజల కష్టాలు తీరనున్నాయి.

Also Read: iBomma in SBI: ఎస్‌బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్‌లో.. ఐబొమ్మ పైరసీ లింక్స్.. అవాక్కైన పోలీసులు!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..