Gruha Jyothi: గ్రేటర్‌‌లో విస్తృతంగా గృహజ్యోతి లేఖల పంపిణీ..!
Gruha Jyothi (imagecredit:swetcha)
హైదరాబాద్

Gruha Jyothi: గ్రేటర్‌ హైదరాబాద్‌లో విస్తృతంగా గృహజ్యోతి లేఖల పంపిణీ..!

Gruha Jyothi: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం దాదాపు రెండేళ్లుగా విజయవంతంగా అమలవుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను చాటిచెప్పేందుకు, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గృహజ్యోతి లబ్ధిదారులకు వారి పేర్లతో వ్యక్తిగతంగా లేఖలు రాశారు. ఈ లేఖలను ఎస్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు 11 లక్షల గృహ జ్యోతి లబ్ధిదారులకు ఈ లేఖలు పంపిణీ చేస్తున్నారు. లేఖలలో ప్రతి వినియోగదారుడి పేరు, సర్వీస్ నంబర్ పొందుపరిచి ఉండటం విశేషం.

వ్యక్తిగత లేఖ

లేఖలో, ఉచిత విద్యుత్ వల్ల వినియోగదారులకు ఆదా అవుతున్న మొత్తాన్ని పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన ఆర్థిక భారాన్ని ప్రభుత్వం పూర్తిగా భరిస్తోందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి గారు లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలాఉండగా గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ పేరుతో వ్యక్తిగత లేఖ రాయడం, అదీ అధికారులు స్వయంగా ఇంటికి వచ్చి అందజేయడంపై వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నాయో ఈ చర్య స్పష్టంగా చూపిస్తోందని, ఇది ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతాభావానికి నిదర్శనమని వారు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Telangana Police: రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఆ రెండు కేసులపై సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.?

గృహ జ్యోతి లబ్ధిదారుల వివరాలు

సర్కిల్ లబ్ధిదారులు

బంజారా హిల్స్ 38,837

హైదరాబాద్ సెంట్రల్ 74,551

సికింద్రాబాద్ 77,296

హైదరాబాద్ సౌత్ 1,08,078

రాజేంద్ర నగర్ 1,43,216

సంగారెడ్డి 2,23,236

సైబర్ సిటీ 77,193

మేడ్చల్ 1,24,014

సరూర్ నగర్ 1,30,162

హబ్సిగూడ 1,41,897

మొత్తం 11,38,480

Also Read: Uttam Kumar Reddy: సంక్రాంతి వేళ రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొనుగోలులో తెలంగాణ రికార్డ్!

Just In

01

NHM Salary Pending: నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల అవస్థలు.. మూడు నెలలుగా జీతాలు బంద్..?

Anil Ravipudi: మెగాస్టార్ సినిమాలో ఇళయరాజా సాంగ్ వాడినా కేసు ఎందుకు వేయలేదంటే?..

CM Revanth Reddy: అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి.. వరుస పర్యటనలతో బిజీ బిజీ!

Thailand Accident: థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం.. 22 మందిని బలి తీసుకున్న భారీ క్రేన్

Supreme Court: అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్​ 17 ఏ పై.. ఎటూ తేలని వ్యవహారం