Telangana Police: ఇటీవలి కాలంలో ఇటు రాజకీయ.. అటు అధకారవర్గాల్లో తీవ్ర కలకలం సృష్టంచిన రెండు కేసుల విచారణ కోసం డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) సిట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్(VC Sajanar) నేతృత్వం వహించనున్నారు. ఇక, సిట్ బృందంలో ఎనిమిది మంది అధికారులను సభ్యులుగా నియమించారు.
సీఎం ఫోటోలను..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఫోటోలను అసభ్యకరంగా మార్ఫ్ చేసి తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూప్(Telangana Public TV WhatsApp Group) నకు చెందిన కావలి వెంకటేశ్(Venkatesh) వేర్వేరు గ్రూపుల్లో షేర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నాయకుడు గూళ్ల నర్సింహ మద్దూర్(Gulla Narasimha Maddur) పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం ఫోటోలను అభ్కంతరకరంగా తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన కావలి వెంకటేశ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు నారాయణ పేట జిల్లా మద్దూరు పోలీసులు ఈనెల 11న పోలీసులు కేసులు నమోదు చేశారు.
Also Read: Ilaiyaraaja: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. మ్యాస్ట్రో అనుమతి తీసుకున్నారా?
ఐఏఎస్ అధికారిణిపై..
కాగా, ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిని కించ పరిచే విధంగా కొన్ని ఛానళ్లలో వార్తలు ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీనిపై ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేశ్ రంజన్(Jayesh Ranjan) హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు రెండు న్యూ ఛానళ్లతోపాటు ఏడు యూ ట్యూబ్ ఛానళ్లపై కేసులు నమోదు చేశారు.
సెక్షన్లు ఇవే..
రెండు కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై అటు మద్దూరు.. ఇటు సీసీఎస్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 75, 78. 79. 351(1), 352(2) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసులు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించటంతోపాటు చర్చనీయమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రెండు కేసుల్లో సమగ్ర విచారణ కోసం డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంట్లో నార్త్ రేంజ్ జాయింట్ సీపీ శ్వేత, చేవెళ్ల జోన్ డీసీపీ యోగేశ్ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్ కుమార్, సీసీఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సీఐ సెల్ ఇన్స్ పెక్టర్ శంకర్ రెడ్డి, సైబర్ సెల్ ఎస్ఐ హరీశ్ ను సభ్యులుగా నియమించారు.
Also Read: Nitin Nabin Sinha: బీజేపీ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం.?

