Nitin Nabin Sinha: బీజేపీ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ నూతన సారథిగా నితిన్ నబీన్ సిన్హా(Nitin Nabin Sinha) పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పలువురు హేమాహేమీల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, రేసులో ఉన్న సీనియర్ల ఆశలపై నీళ్లు చల్లుతూ హైకమాండ్ అనూహ్యంగా నితిన్ నబీన్ సిన్హా వైపు మొగ్గు చూపింది. ఇటీవల ఆయనను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించిన అధిష్ఠానం, ఇప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది.
Also Read: Hydra: హైడ్రా ప్రజావాణికి ఒక్కరోజే 76 ఫిర్యాదులు.. నేరుగా స్వీకరించిన కమిషనర్ రంగనాథ్!
19న నియామకం.. 20న బాధ్యతల స్వీకరణ
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 19వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకానికి ఎన్నిక జరిగింది. కాగా నితిన్ నబీన్ సిన్హా ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరుసటి రోజే అంటే జనవరి 20న ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ(Modhi), కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) ద్వయం యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Director Maruthi: ‘ది రాజా సాబ్’ అర్థం కావడానికి టైమ్ పడుతుందని నాకు ముందే తెలుసు!

