Suraksha Kavach (imagecredit:twitter)
హైదరాబాద్

Suraksha Kavach: పోకిరీల ఆటలకు చెక్.. స్కూల్​ పిల్లల కోసం సురక్ష కవచ్..!

Suraksha Kavach: స్కూళ్లలో చదువుకుంటున్న 1‌‌‌‌0వ తరగతి లోపు విద్యార్థుల భద్రత కోసం సైబరాబాద్​ ఉమెన్​, చైల్డ్​ సేఫ్టీ వింగ్​ డీసీపీ సృజన(DCP Srujana) చర్యలకు శ్రీకారం చుట్టారు. సురక్షా కవచ్(Suraksha kavach)​ పేర శారీరక, సైబర్(Syber)​, సైకలాజికల్(Psychological)​, రోడ్డు భద్రతపై విద్యార్థులు, అధ్యాపక వర్గాలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. లింగంపల్లిలో ఎస్​ఎస్​సీ స్కూల్స్​ అసోసియేషన్(SSC Schools Association) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇప్పటికే సురక్షా కవచ్ కార్యక్రమాన్ని శ్రీరాం అకాడమీలో ప్రారంభించినట్టు చెప్పిన డీసీపీ సృజన దీనిని 100 స్కూళ్లకు విస్తరించనున్నట్టు తెలిపారు.

పోకిరీలపై ఫోకస్​

అదే సమయంలో మహిళలు, యువతులను వేధిస్తున్న పోకిరీల ఆ కట్టించటానికి షీ టీమ్స్(She Teams) ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు డీసీపీ సృజన తెలిపారు. గడిచిన వారంలో కమిషనరేట్​ పరిధిలోని వేర్వేరు చోట్ల 152 డెకాయ్​ ఆపరేషన్లు జరిపి 45మంది జులాయిలను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అందరిపై పెట్టీ కేసులు నమోదు చేసి వారి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక, మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించేందుకు 69 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు.

Also Read: Attack on Minister: బీహార్ మంత్రిని ఛేజ్ చేసి దాడికి పాల్పడ్డ గ్రామస్తులు.. ఎందుకంటే?

అవగాహన కార్యక్రమాలు

చిన్న చిన్న సమస్యలతో గొడవలు పడుతున్న 23 జంటలకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లలో కౌన్సెలింగ్ ఇచ్చినట్టు చెప్పారు. వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించినట్టు తెలిపారు. దాంతోపాటు మానవ అక్రమ రవాణా(Human trafficking), చైల్డ్​ ట్రాఫికింగ్(Child trafficking)​, ఈవ్ టీజింగ్(Eve teasing)​, సోషల్ మీడియా(Social Media) వేధింపులు, బాల్య వివాహాలు, చైల్డ్ రైట్స్, బాల కార్మికులు తదితర అంశాలపై కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు చోట్ల అవగాహన కార్యక్రమాలు జరిపినట్టు వివరించారు. వ్యభిచార కార్యకలాపాలు జరుపుతున్న 13మంది ట్రాన్స్​ జెండర్లను రక్షించి హోంకు తరలించినట్టు తెలిపారు. మహిళలు ఎలాంటి సమస్యలు ఉన్నా 181 నెంబర్​ కు ఫోన్​ చేయాలని సూచించారు. చైల్డ్​ హెల్ప్​ లైన్ 1098ను కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు.

Also Read: Sandeep Reddy Vanga: సీఎం సహాయనిధికి సందీప్ రెడ్డి వంగా రూ. 10 లక్షల విరాళం

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ