Marriage ( Image Source: Twitter)
Viral

Weight Gain Causes: పెళ్లి తర్వాత కొత్త దంపతులు లావవడానికి కారణాలు ఇవే..

Weight Gain Causes: పెళ్లి జరిగిందంటే చాలు, ఇరు కుటుంబాల్లో సందడీ మొదలవుతుంది. పెళ్లికి ముందు కొన్ని రోజుల నుంచి, పెళ్లి తర్వాత కొన్ని రోజుల వరకూ ఈ హడావుడి ఉంటూనే ఉంటుంది. కానీ, ఇంత సందడి మధ్య నూతన దంపతులు ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా మార్పు చెందుతారు. అదే బరువు పెరగడం. పెళ్లికి ముందు సన్నగా, స్మార్ట్‌గా ఉండేవారు కూడా పెళ్లయ్యాక, లావుగా మారిపోతారు.

ఇంతకీ, ఈ బరువు పెరగడానికి కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

మొదటి కారణం

పెళ్లి తర్వాత వచ్చే కొంచం విశ్రాంతి దొరుకుతుంది. పెళ్లికి ముందు ఎంతో కష్టపడి పనిచేసినవారు కూడా, పెళ్లయ్యాక కొంత సమయం విశ్రాంతి తీసుకుంటారు. దీనికి తోడు, పెళ్లి ఒత్తిడి తగ్గడంతో ఆహారం ఎక్కువగా తినడం మొదలవుతుంది. పని తగ్గి, బద్దకం పెరిగిపోతుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు.

Also Read: NTRNEEL: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఇవ్వబోతున్న ట్రీట్ ఇదే.. ఈ సారి రెండు కాదు నాలుగు ఎగరేసుకోవచ్చు!

రెండో కారణం

పెళ్లికి ముందు ఒంటరిగా ఉంటూ, తమకు ఇష్టమైన ఆహారం తినేవారు, పెళ్లయ్యాక భాగస్వామి కోసం కాస్త అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇద్దరి రుచులు వేరు వేరుగా ఉంటాయి. అప్పుడు కొన్ని రోజులు ఎవరికీ నచ్చింది వాళ్ళు చేసుకుని
అవసరం కంటే ఎక్కువగా తినేస్తారు.

Also Read: Gadwal Jodu Panchelu: గద్వాల సంస్థానాధీశుల వారసులు.. ఏడుకొండల వెంకన్నకు ఏరువాడ జోడు పంచెలు

మూడో కారణం

పెళ్లికి ముందు చాలా మంది జిమ్‌కి వెళ్తుంటారు. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టినవారు కూడా, పెళ్లయ్యాక కొత్త జీవనశైలిలో వ్యాయామానికి కొంచం గ్యాప్ ఇస్తారు. బద్దకం చుట్టుముడితే, వ్యాయామం మానేస్తారు. దీనివల్ల కేలరీలు కరగక , బరువు పెరగడం సహజం.సైంటిస్టుల పరిశోధనల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఏ జంట అయినా పెళ్లయిన కొన్ని నెలల్లో కనీసం 2 నుంచి 3 కిలోల బరువు పెరుగుతారని వెల్లడించారు.

Also Read: Bigg Boss 9 Agnipariksha: బిగ్‏బాస్ అగ్ని పరీక్షకు జడ్జీగా అతను పనికిరాడు? కౌశల్ సంచలన వీడియో రిలీజ్

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు