NTRNEEL: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకి ఎన్టీఆర్ (Jr NTR) ట్రీట్ ఇవ్వడం ఏమిటి? అని ఆశ్చర్యపోతున్నారు కదా. నిజంగా నిజం.. పవర్ స్టార్ పుట్టినరోజుకు ఒక రోజు ముందు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ట్రీట్ ఏంటో తెలిస్తే.. ఈసారి రెండు కాదు.. నాలుగు కాలర్స్ ఎగరేసుకోవచ్చు. ఇంతకీ ట్రీట్ ఏంటి? అని అనుకుంటున్నారా? ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను దక్కించుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ‘కేజీయఫ్’ సిరీస్, సలార్ వంటి సంచలనాత్మక బ్లాక్‌బస్టర్‌లను అందించిన మావెరిక్ మేకర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి వర్కింగ్ టైటిల్‌గా NTR Neel అని పేరు పెట్టిన విషయమూ తెలిసిందే. అలాగే ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లుగా.. సినిమా మొదలైనప్పటి నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడీ సినిమా టైటిల్ ఏంటో తెలిసే సమయం వచ్చేసింది.
Also Read- Maaman OTT: మేనల్లుడిపై మేనమామ చూపే ప్రేమ.. భార్యకు నచ్చకపోతే! ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా!
అదీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) బర్త్‌డేకి ఒక రోజు ముందు రివీల్ చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఆఫ్‌కోర్స్.. పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ అని మెన్షన్ చేయలేదు కానీ, సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే అయితే.. సెప్టెంబర్ 1న ఎన్టీఆర్, నీల్ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ని విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పుడో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌ని వైరల్ చేస్తూ.. పవన్ కళ్యాణ్ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఇచ్చే ట్రీట్ ఇదేనంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్టీఆర్ సినిమాల విడుదల సమయంలో ఏపీలో టికెట్ల ధరలను పెంచుకునేందుకు పవన్ కళ్యాణ్ చేసిన సపోర్ట్‌కు ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే ‘అరవింద సమేత’ చిత్ర ఓపెనింగ్‌కు వచ్చి టీమ్‌ను బ్లెస్ చేశారు పవన్ కళ్యాణ్. సో.. పవన్, ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉందనే విషయం తెలుస్తూనే ఉంది.
Also Read- Viral Video: పనసకాయలకు రంగులు వేసి.. నిగనిగలాడేలా చేసి.. కల్తీలో ఇది పీక్స్ భయ్యా!
అలాగే వీళ్లద్దరికీ గురూజీ త్రివిక్రమ్ ఉండనే ఉన్నారు. అలా లింక్ కలిపి, పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారంటూ.. ఇరు హీరోల ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అటు నిర్మాణ సంస్థ కానీ, ఇటు దర్శక, హీరోలు కానీ.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. మరి ఇది ఎంత వరకు నిజమనేది తెలియాలంటే, చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన లేదంటే వివరణ రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో తెలియంది కాదు. ఇక రీసెంట్‌గా ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబట్టలేక పోయిన విషయం తెలిసిందే. అందుకే అందరి కళ్లు ‘ఎన్టీఆర్ నీల్’ సినిమాపైనే ఉన్నాయి.
Finally 🤩🤩🤩
September 1st Title & Glimpse 🥳🥳🥳#NTRNeel #ManOfMassesNTR pic.twitter.com/NxkzYcJ0oy— 𝐘𝐀𝐒𝐇𝐔 (@_Yashu9999_) August 27, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
