Maaman OTT: మేనల్లుడిపై మేనమామ చూపే ప్రేమ.. ఓటీటీలోకి!
Maaman OTT
ఎంటర్‌టైన్‌మెంట్

Maaman OTT: మేనల్లుడిపై మేనమామ చూపే ప్రేమ.. భార్యకు నచ్చకపోతే! ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా!

Maaman OTT: ఎప్పుడూ వీకెండ్‌కు ఓటీటీలలో సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. కానీ ఫెస్టివల్స్ సమయంలో సరికొత్త కంటెంట్‌తో వీక్షకులకు ట్రీట్ ఇవ్వడానికి ప్రతి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రయత్నాలు చేస్తుంటుందనే విషయం తెలియంది కాదు. అందుకే స్టార్ హీరోల చిత్రాలకు నిబంధనలతో పని లేకుండా, భారీ మొత్తం చెల్లించి ఈ మధ్య ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుంటున్నాయి కొన్ని ప్లాట్‌ఫామ్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అలానే స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు మరో వైవిధ్య భరిత చిత్రాన్ని ఈసారి జీ5 సంస్థ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అదీ కూడా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని, జీ5 సంస్థ ఈ సినిమాను ప్రత్యేకంగా స్ట్రీమింగ్‌కు తీసుకురావడం విశేషం.

Also Read- Mana Shankara VaraPrasad Garu : వినాయకచవితి స్పెషల్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి న్యూ లుక్ రిలీజ్..

భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫామ్ అయిన ZEE 5 ఓటీటీ.. 2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఆడియెన్స్‌ని అల‌రించేందుకు సిద్ధమైంది. గణేష్ చతుర్ధి స్పెషల్‌గా మ‌రో విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. ఆ సినిమా మరేదో కాదు.. ‘మామ‌న్‌’. ఆల్రెడీ ఈ సినిమా జీ5 ఓటీటీలో ఆగస్ట్ 8 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే ఓన్లీ తమిళ్ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను ఆగస్ట్ 27 నుంచి అందుబాటులోకి తెచ్చేసింది. భావోద్వేగాలు క‌ల‌గ‌లిసిన కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కులను అల‌రించిన ‘మామ‌న్‌’ (Maaman) చిత్రం.. ఇప్పుడు ZEE 5లో స్ట్రీమింగ్ కానుండ‌టంతో మ‌రింత మంది ప్రేక్ష‌కుల‌కు రీచ్ అవుతుందని చిత్రయూనిట్ భావిస్తోంది. ఇందులో ఉన్న కంటెంట్‌కు కచ్చితంగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తారని జీ5 టీమ్ నమ్ముతుంది.

Also Read- Manchu Lakshmi: మూస్తావా.. మంచు లక్ష్మి ఒక్కసారే అలా అనేసిందేంటి?

‘మామ‌న్‌’ కథ విషయానికి వస్తే.. ఇన్‌బా(సూరి) చెల్లెలు గిరిజ (శ్వాసిక‌)కు పెళ్లై ప‌దేళ్లైనా పిల్ల‌లు పుట్టరు. గిరిజ ఎక్కడని మెట్లు, మొక్క‌ని దేవుడు ఉండడు. అలా ఆమె మొక్కులు ఫలించి చివ‌ర‌కి ఆమె ఓ బాబుకి జ‌న్మ‌నిస్తుంది. ఇన్‌బాకు లేక లేక పుట్టిన తన మేన‌ల్లుడు నిల‌న్ (ప్ర‌గీత్ శివ‌న్‌) అంటే అమిత‌మైన ప్రేమ‌. తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఏది అడిగితే అది తెచ్చిస్తాడు. త‌న‌ను ప్రేమ‌గా ల‌డ్డు అని పిలుచుకుంటుంటాడు. మేనమామ అంటే ఉన్న ఇష్టంతో అతని దగ్గరే పెరుగుతాడు. ఈలోపు ఇన్‌బా, రేఖ‌ను పెళ్లి చేసుకుంటాడు. ల‌డ్డుకి మామ అంటే ఉండే ప్రేమ‌తో అత‌నితోనే ఉంటాడు. కానీ, అది రేఖ‌కు న‌చ్చ‌దు. దీంతో ఆమె ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది? చివ‌ర‌కు ల‌డ్డు వ‌ల్ల ఇన్‌బా, రేఖ విడిపోయారా? ఇన్‌బాపై నిల‌న్‌కు ఉన్న ప్రేమ‌ను రేఖ అర్థం చేసుకుంటుందా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే.. తాజాగా జీ5లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం

Revanth Reddy – Messi: మెస్సీతో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్