Manchu Lakshmi Daksha
ఎంటర్‌టైన్మెంట్

Manchu Lakshmi: మూస్తావా.. మంచు లక్ష్మి ఒక్కసారే అలా అనేసిందేంటి?

Manchu Lakshmi: ఇంతకీ ఎవరిని మంచు లక్ష్మి ‘మూస్తావా’ అని అంది అని అనుకుంటున్నారు కదా! ఇది రియల్ సంఘటన కాదండోయ్.. రీల్ సంఘటన. మంచు లక్ష్మి (Manchu Lakshmi) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). అప్పుడెప్పుడో ‘అగ్ని నక్షత్రం’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి.. టైటిల్ మార్చి ‘దక్ష’గా తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ఈ సినిమాను శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఇందులో మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- They Call Him OG: ఫైర్ స్ట్రోమ్ తర్వాత ఇలాంటి సాంగ్‌ని అసలు ఊహించలేదు.. హార్ట్ టచింగ్!

లేడీ పోలీస్ ఆఫీసర్‌గా..
ఈ టీజర్‌లో ఇప్పటి వరకు మంచు లక్ష్మి కనిపించని వీరోచిత పాత్రలో, పవర్ ఫుల్ ఇన్విస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. వింత ఆకారంలో ఏలియన్ వంటి ఓ జీవి మనుషుల్ని దారుణంగా చంపే సన్నివేశంతో టీజర్‌ స్టార్టయింది. ఓ వింత వ్యాధి నేపథ్యం, దాని వెనుక కారణం ఏంటనేది సైంటిఫిక్‌గా చెప్పబోతున్నట్లుగా టీజర్ ఇంట్రస్ట్‌ని కలగజేస్తుంది. సముద్ర ఖని, విశ్వంత్, సిద్ధిక్, జెమినీ సురేష్ వంటి వారు ఇందులో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక టీజర్ చివరిలో డాక్టర్ మోహన్ బాబు కనిపించిన ఒకే ఒక్క షాట్.. టీజర్‌ స్థాయిని పెంచేసింది. ఇక ఇన్విస్టిగేషన్ ఆఫీసర్‌గా మంచు లక్ష్మి చేసే మ్యానరిజమ్స్, స్టైల్.. మరీ ముఖ్యంగా మూస్తావా? అని ఆమె సైగ చేసిన తీరు అన్నీ కూడా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేవిగా ఉన్నాయి. ఇందులో ఆమె ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసినట్లుగా ఈ టీజర్ తెలియజేస్తుంది. మొదటిసారి మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి కలిసి ఒకే చిత్రంలో నటించనుండటంతో ఈ సినిమాపై మాములుగానే క్రేజ్ ఏర్పడుతోంది. ఇప్పుడొచ్చిన టీజర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో.. మంచు ఫ్యామిలీ అకౌంట్‌లో హిట్ పడే అవకాశమే ఉన్నట్లుగా.. ఈ టీజర్ చూసిన వారు మాట్లాడుకుంటున్నారు.

Also Read- Mana Shankara VaraPrasad Garu : వినాయకచవితి స్పెషల్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి న్యూ లుక్ రిలీజ్..

సెన్సార్ పూర్తి.. విడుదల ఎప్పుడంటే?
ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ బోర్డ్ నుంచి UA సర్టిఫికేట్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా.. మంచి మెసేజ్‌తో వస్తున్న ఇలాంటి సినిమాలు ఇప్పుడవసరం అంటూ సెన్సార్ సభ్యులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారని టీమ్ చెబుతోంది. ముఖ్యంగా మంచు లక్ష్మీ ప్రసన్న చేసిన టైటిల్ పాత్రను సెన్సార్ బోర్డు సభ్యులు కొనియాడినట్లుగా టీమ్ తెలిపింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు