Crime News( image credit: free pic )
హైదరాబాద్

Crime News: వృద్ధ దంపతుల హత్యలో నిందితుడి అరెస్ట్.. భలే పట్టేశారే!

Crime News: సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో అల్వాల్ పోలీసులు రెండు రోజుల్లోనే మిస్టరీని ఛేదించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితున్ని అరెస్ట్​ చేశారు. మేడ్చల్​ డీసీపీ ఎన్​.కోటిరెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అల్వాల్ సూర్యనగర్​ లో నివాసులు, భార్యభర్తలైన రాజమ్మ (65), కనకయ్య (70)లు ఈనెల 4న దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే.

దీనిపై కేసులు నమోదు చేసిన అల్వాల్​ పోలీసులు  మచ్చబొల్లారం కృష్ణానగర్​ కాలనీకి చెందిన చింతకింది అనిల్​ (40)ను అరెస్ట్​ చేశారు. విచారణలో అనిల్​ పాత నేరస్తుడని వెల్లడైంది. వేర్వేరు పోలీస్​ స్టేషన్లలో అతనిపై 29 కేసులు నమోదై ఉన్నట్టుగా తెలిసింది. వృద్ధ దంపతులను హత్య చేయటానికి ముందు రోజు సూర్యనగర్​ లోనే ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించినట్టు వెల్లడైంది.

 Also Read: Operation sindoor: ఆపరేషన్ సింధూర్.. తెలంగాణలోభద్రతా చర్యలపై.. ముఖ్యమంత్రి సమీక్ష!

చప్పుడుకు ఇంట్లోవాళ్లు లేవటంతో పరారైన అనిల్ ఆ మరుసటి రోజు కనకయ్య దంపతుల ఇంట్లోకి చొరబడి కర్రతో భార్యాభర్తల త​లలపై కొట్టి చంపి రాజమ్మ మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం, వెండి పట్టగొలుసులు, ఇంట్లోని నగదు, రెండు మొబైల్​ ఫోన్లను దోచుకుని ఉడాయించినట్టుగా నిర్ధారణ అయ్యింది.

ఈ క్రమంలో నిందితున్ని పోలీసులు జైలుకు రిమాండ్ చేశారు. కేసును పర్యవేక్షించిన ఏసీపీ రాములు, దర్యాప్తు జరిపిన సీఐలు రాహుల్​ దేవ్​, తిమ్మప్ప, దాలి నాయుడు, శ్యాం సుందర్​ రెడ్డితోపాటు సిబ్బందిని డీసీపీ అభినందించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ