Gang Wars - Sajjanar: వరుస గ్యాంగ్ వార్స్.. రంగంలోకి సజ్జనార్!
Gang Wars - Sajjanar (Image Source: Twitter)
హైదరాబాద్

Gang Wars – Sajjanar: హైదరాబాద్‌లో గ్యాంగ్ వార్స్.. రంగంలోకి సజ్జనార్.. రౌడీలకు మాస్ వార్నింగ్!

Gang Wars – Sajjanar: హైదరాబాద్ లో వరుస గ్యాంగ్స్ వార్స్ చోటుచేసుకుంటున్నాయి. నాంపల్లిలోని దర్గా వద్ద కొందరు యువకులు పరస్పరం దాడికి దిగారు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అయితే ఇప్పటికే టోలి చౌకి, ఆసీఫ్ నగర్ సహా చాలా చోట్ల స్ట్రీట్ ఫైట్లు కలకలం సృష్టించాయి. ఇలా వరుసగా ఘర్షణలు చోటుచేసుకుంటుండటంతో స్థానికుల్లో భయాందోళనలు మెుదలయ్యాయి. గత కొన్నేళ్లుగా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో మరోమారు గ్యాంగ్ వార్స్ పురుడుపోసుకుంటుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో నగర కమిషనర్ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు.

సజ్జనార్.. అకస్మిక తనిఖీలు

నగరంలో గ్యాంగ్ వార్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక.. లంగర్ హౌస్, టోలి చౌకి ప్రాంతంలో పర్యటించారు. రాత్రి 12 నుంచి 9 గంటల ప్రాంతంలో రౌడీ షీటర్ల ఇళ్లను అకస్మికంగా తనిఖీ చేశారు. నేర చరిత్ర, జీవనశైలిపై ప్రత్యక్షంగా ఆరా తీశారు. నేర ప్రవృత్తిని మానుకోవాలని కఠినంగా హెచ్చరించారు.

షాపు యజమానులకు వార్నింగ్..

మరోవైపు అర్ధరాత్రి దాటినా షాపులు తెరిచి ఉంచిన వారిపై సీపీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపుల వద్ద జనాలు పోగై గొడవలు చోటుచేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా సీపీ అసహనం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు రాత్రివేళ్లలో పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతను సైతం సజ్జనార్ పరిశీలించారు. టోలిచౌకీ పీఎస్ లో రాత్రి ఎంట్రీలు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. నగర భద్రతపై పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు సజ్జనార్ స్పష్టం చేశారు.

పోలీసులపై ప్రజల ఆగ్రహం

హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న స్ట్రీట్ ఫైట్స్ ఫైట్స్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ పరిధిలో ఈ అల్లర్లు చోటుచేసుకోవడం స్థానికుల్లో అసహనాన్ని పెంచుతోంది. గత వారం టోలీ చౌకీ, ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో స్ట్రీట్ ఫైట్స్ జరగ్గా.. తాజాగా హబీబ్ నగర్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి దర్గా వద్ద కొందరు యువకులు గొడవపడటం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రౌడీయిజం చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.

Also Read: Local Body Elections: స్థానిక ఎన్నికల్లో పట్టు కోసం ప్రభుత్వం ప్లాన్.. ఆ గుర్తుతో 90 శాతం గెలిచేందుకు సిద్దం..!

హింసాత్మక ఘర్షణ

శుక్రవారం (నవంబర్ 21) అర్థరాత్రి ఆసిఫ్‌నగర్ PS పరిధి మురాద్‌నగర్ చోటి మస్జిద్ దగ్గర జరిగిన గ్యాంగ్ వార్ ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఒక గ్యాంగ్ గుంపులుగా వెళ్లి కొందరు యువకులపై చేసి దాడి అందరినీ షాక్ కు గురిచేిసంది. టిప్పు సుల్తాన్ అలియాస్ టిప్పు షేర్.. షబ్బీర్, ఖలీల్, అప్పు అనే యువకుల గ్యాంగ్ మధ్య ఈ గొడవ జరిగింది. రోడ్లపై పరిగెడుతూ కర్రలతో దాడి చేసుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. స్థానికుల ఫిర్యాదుతో ఆసిఫ్ నగర్ పోలీసులు.. కేసు నమోదు చేశారు.

Also Read: CJI Surya Kant: సుప్రీంకోర్టుకు కొత్త సీజేఐ.. జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం.. హాజరైన రాష్ట్రపతి, ప్రధాని

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?