Old City Metro( IMAGE credit: swetcha reporyter)
హైదరాబాద్

Old City Metro: పాతబస్తీ మెట్రో పనులు వేగవంతం.. పిల్లర్ల మార్కింగ్ పనులు షురూ!

Old City Metro: ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మిస్తున్న మెట్రో రైలు కారిడార్ పనులు వేగం పుంజుకున్నాయి. రోడ్డు విస్తరణ పనుల వల్ల ప్రభావితమయ్యే ఆస్తుల సంఖ్యను తగ్గించేందుకు మెట్రో(Metro) అధికారులు అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు. ఇదివరకు 1,100 ఆస్తులు కూల్చాల్సి ఉంటుందని అంచనా వేయగా, ఇప్పుడు ఆ సంఖ్య 900కు తగ్గింది. ఇప్పటివరకు 380 ఆస్తుల కూల్చివేతలు పూర్తయ్యాయి. ఈ ఆస్తుల యజమానులకు రూ. 360 కోట్ల నష్టపరిహారం చెల్లించారు.

Also Read: BC Reservation Bill: 6న జంతర్ మంతర్ వద్ద బీసీ బిల్లుపై ధర్నా

పిల్లర్ల మార్కింగ్..
మెట్రో(Metro) నిర్మాణ పనుల కోసం పిల్లర్ల మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయి. పిల్లర్లు, స్టేషన్లు వచ్చే ప్రాంతాల్లో భూసార పరీక్షలు నిర్వహించడానికి ఒక ఏజెన్సీని నియమించారు. చారిత్రక కట్టడాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, డీజీపీఎస్ సర్వే ద్వారా పిల్లర్ల స్థానాలను నిర్ణయించారు.

యుటిలిటీ లైన్ల మార్పునకు ప్రణాళిక..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)  ఆదేశాల మేరకు విద్యుత్ లైన్లను భూగర్భంలోకి మారుస్తున్నారు. అలాగే, మంచినీటి, మురుగునీటి లైన్లను మార్చడానికి వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ,(GHMC) టీజీఎస్పీడీసీఎల్ వంటి సంస్థల నుంచి అంచనాలు కోరారు. మెట్రో(Metro) పనులను హెచ్‌ఏఎంఎల్ ఎండీ డాక్టర్ ఎన్వీఎస్ రెడ్డి(NVS Reddy) రోజూ సమీక్షిస్తున్నారు. రాత్రిపూట కూడా పనులు కొనసాగిస్తూ, పాతబస్తీ ప్రజలకు త్వరలో మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

 Also Read: Telangana: ఆ విషయంలో తెలంగాణను ఢీకొట్టే రాష్ట్రమే లేదు.. దేశంలోనే నెంబర్ వన్!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?